Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నా కెరీర్ ప్రారంభంలో మహిళల్ని ఇబ్బందిపెట్టే పాత్రలు పోషించా. అప్పుడు చేసిన తప్పుకు బాధపడుతున్నా. ఆ తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నా' అని హీరో అజిత్ అన్నారు. సినిమాల్లో మహిళల పాత్రల్ని కించపరిచినందుకు బాధ పడుతున్నట్టు ఇటీవల ఆయన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ప్రస్తుతం హెచ్.వినోత్ దర్శకత్వంలో 'నెర్కొండ పార్వై' సినిమాలో నటిస్తున్నారు. బాలీవుడ్లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'పింక్'కిది రీమేక్. టీజర్ రిలీజ్ సందర్భంగా అజిత్ మాట్లాడుతూ, 'ప్రారంభంలో నేను మహిళలను ఇబ్బంది పెట్టే పాత్రలు పోషించా. అప్పుడు చేసిన తప్పుకి చింతిస్తున్నా. ఆ పొరపాటుని సరిదిద్దుకుని, మహిళల్ని గౌరవించే పాత్రలో ఆదర్శంగా నిలవడానికి ఈ సినిమాలో నటిస్తున్నా' అని అన్నారు.