Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నేను ప్రేమలో పడను.. కేవలం ప్రేమిస్తా..' అని అంటున్నారు నాగార్జున. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం 'మన్మథుడు 2'. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తుంది. కీర్తిసురేష్, సమంత కీలక పాత్రలు పోషిస్తున్నారు. మనం ఎంటర్ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18 స్టూడియోస్ పతాకంపై నాగార్జున, పి.కిరణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ని గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందం స్పందిస్తూ, 'విడుదలైన టీజర్‌కి విశేష స్పందన లభిస్తుంది. ఇందులో 'ఎండిపోయిన చెట్టుకి నీళ్లు పోస్తే మళ్ళీ పూలు పూస్తాయా సార్?', 'పిల్లలకు కోచింగ్ ఇవ్వాల్సిన వయసులో నువ్వు బాటింగ్కి దిగుతావేంట్రా' అని, 'ఇంకా నువ్వు వర్జినే కదరా!',
చివర్లో 'ఐ డోంట్ ఫాల్ ఇన్ లవ్.. ఐ ఓన్లీ మేక్ లవ్' అనే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. టీజర్‌ని బట్టి చూస్తే ఇందులో నాగార్జున వర్జీన్ యువకుడిగా బయటకు కనపడతారు, కానీ మరో పక్క అమ్మాయిల వెంటపడే ఉమనైజర్ పాత్రలో ప్లేబారు తరహాలో కనిపించనున్నట్టు అర్థమవుతుంది. ఇలాంటి బోల్డ్ రోల్లో నాగార్జున నటించడం ఇదే తొలిసారి. సినిమాని లావిష్‌గా తెరకెక్కించాం. సినిమాటోగ్రఫీ పెద్ద అసెట్ కానుంది. సింగిల్ షెడ్యూల్ మినహా సినిమా చిత్రీకరణంతా పూర్తయ్యింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస్ట్ 9న సినిమా విడుదలకు ప్లాన్
చేస్తున్నారు' అని తెలిపింది. సీనియర్ నటి లక్ష్మి, వెన్నెల కిశోర్, రావు రమేష్, ఝాన్సీ, దేవదర్శిని తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చైతన్ భరద్వాజ్ , కెమెరా: ఎం.సుకుమార్, ప్రొడక్షన్ డిజైనర్స్: ఎస్.రామక ష్ణ, మౌనిక, ఎడిటర్స్: ఛోటా కె.ప్రసాద్, బి.నాగేశ్వర రెడ్డి.