Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''బాధని, సంతోషాన్ని పంచుకోవడానికి ఎవరూ లేరు' అని శ్రద్ధా కపూర్ తన ఆవేదనని వ్యక్తం చేయగా, 'నీకు నేనున్నా'నంటూ ప్రభాస్ భరోసా ఇవ్వడంతో ప్రారంభమైన 'సాహో' టీజర్ ఆద్యంతం మేకింగ్ షాట్స్‌తో అదరగొట్టింది. ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం 'సాహో'. సుజిత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్ర టీజర్ గురువారం విడుదలైంది. ఆద్యంతం స్టయిలీష్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో, హలీవుడ్ తరహాలో సాగిన టీజర్ విశేషంగా ఆకట్టుకుంటుంది. చివర్లో విలన్లని ఉద్దేశించి శ్రద్ధా అడిగిన ప్రశ్నలకు 'ఫ్యాన్స్..', 'డై హార్డ్ ఫ్యాన్' అని ప్రభాస్ చెప్పడం ఆసక్తి క్రియేట్ చేస్తుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం తెలియజేస్తూ, 'తాజాగా విడుదలైన టీజర్ సంచలనాలు సృష్టిస్తుంది. 25 మిలియన్ వ్యూస్‌తో రికార్డ్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. మేకింగ్ వీడియోల్లోనే వీటి గురించి ప్రత్యేకంగా చెప్పిన దర్శకుడు ఇప్పుడు టీజర్లో మరింత అద్భుతమైన ఔట్పుట్ ఇచ్చాడు. అంతగా యాక్షన్ సీన్స్‌తో దర్శకుడు సుజిత్ వరల్డ్ క్లాస్ మేకింగ్ చూపించాడు. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ ఎలాంటి సినిమా చేయాలని అభిమానులు కోరుకున్నారో ఈ సినిమా అచ్చం అలాగే ఉంది. టీజర్లో కనిపించిన సీన్స్ హాలీవుడ్ సినిమాలను గుర్తుకు తెస్తాయి. ప్రేక్షకుల, అభిమానుల అంచనాలను అందుకునేలా ప్రభాస్ స్టైలిష్‌గా, కొత్త ఎనర్జీతో కనిపించారు. నిర్మాతలు ఏ విషయంలోనూ రాజీపడకుండా అంత్యంత భారీ బడ్జెట్‌తో క్వాలిటీగా తెలుగు, తమిళం, హిందీలో తెరకెక్కిస్తున్నారు. మూడు భాషల్లో ఒకేసారి చిత్రీకరించిన ఈ చిత్రాన్ని ఒకే రోజున విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా అగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు ప్లాన్ చేస్తున్నాం' అని తెలిపింది.
చిత్ర టీజర్‌పై సినీ ప్రముఖుల ప్రశంసలు
నాగార్జున : ఇంత గొప్ప సినిమాని తీస్తున్నందుకు ప్రభాస్‌కి, యూవీ క్రియేషన్స్‌కి 'సాహో'!. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్.
రాజమౌళి : 'సాహో' టీజర్ అద్భుతంగా ఉంది. ప్రభాస్ బలం ఏంటంటే.. హ్యాండ్సమ్గా ఉన్నాడు, డార్లింగ్లానూ కనిపిస్తాడు. పెట్టిన బడ్జెట్‌కి యూవీ క్రియేషన్స్, బాధ్యత విషయంలో సుజిత్ సమానంగా న్యాయం చేస్తున్నారు.
పూరీ జగన్నాథ్ : 'సాహో'..హ్యాట్సాఫ్.
గోపీచంద్ : సూపర్ ఫెంటాస్టిక్ టీజర్. నా స్నేహితుడు ప్రభాస్‌కి ఆల్ ది బెస్ట్.
సురేందర్‌రెడ్డి : టీజర్ ఫెంటాస్టిక్‌గా ఉంది. ప్రభాస్, శ్రద్ధా కపూర్ అండ్ టీమ్‌కి ఆల్ ది బెస్ట్.
పరుచూరి గోపాలకృష్ణ : 'సాహో'..ఓహో.. అని ప్రేక్షకుల నీరాజనాలు పొందాలని కోరుకుంటూ, మా ప్రభాస్ ప్రభాకర తేజస్సుతో వెలిగిపోవాలని ఆశీర్వదిస్తున్నా.
తమన్నా : 'సాహో' టీజర్ గురించి ఎంత పొగిడినా తక్కువే. బాగా నచ్చింది. సినిమా కోసం వెయిట్ చేస్తున్నా.
విజయ్ దేవరకొండ : పెద్ద తెరపై ప్రభాస్ అన్నని చూసేందుకు సూపర్ ఎగ్జైటింగ్‌గా ఉన్నా.
వీరితోపాటు రానా, శర్వానంద్, నితిన్, మంచు విష్ణు, అల్లు శిరీష్, సిద్ధార్థ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మారుతి, అడివి శేషు, ఛార్మి, సుశాంత్, సందీప్ కిషన్, సాయిధరమ్ తేజ్, రాహుల్ రవీంద్రన్, హర్షవర్థన్ రాణే, సంపత్‌నంది, శ్రీవిష్ణు తదితరులు టీజర్‌పై ప్రశంసలు కురిపించారు.