Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్టీఆర్ ఇప్పటి వరకు మరే ఇతర హీరోల సినిమాల్లో అతిథిగా నటించలేదు. అలాగే మల్టీస్టారర్ కూడా చేయలేదు. మొదటిసారి ఆర్ఆర్ఆర్ఃతో మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారు. తాజాగా గెస్ట్‌గానూ మెరిసేందుకు గ్రీన్ సిగల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అది కూడా కీర్తిసురేష్ నటిస్తున్న మహిళా ప్రధానమైన సినిమాలో కావడం విశేషం. కీర్తి సురేష్ ప్రస్తుతం నరేంద్ర దర్శకత్వంలో ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తుంది. మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో అతిథి పాత్ర కోసం ఎన్టీఆర్‌ని చిత్ర యూనిట్ అప్రోచ్ అయ్యారట. నిర్మాతతో ఆయనకున్న అనుబంధం నేపథ్యంలో ఇందులో నటించేందుకు ఎన్టీఆర్ కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. మరి ఇందులో ఆయన ఎలాంటి పాత్రలో మెరవనున్నారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇదిలా ఉంటే, ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ ఃఆర్ ఆర్ ఆర్ఃలో రామ్‌చరణ్‌తో కలిసి నటిస్తున్నారు. కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటిస్తున్నారు. ఇందులో చరణ్ సరసన అలియాభట్ కథానాయికగా నటిస్తుండగా, ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నారు. డి.వి.వి.దానయ్య నిర్మించే ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ని స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఆగస్ట్ 15న విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తుందట.