Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చేతన్ మద్దినేని, కశిష్ ఓరా జంటగా నరేష్కుమార్ దర్శకత్వంలో డాల్ఫిన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మంజునాధ్ వి.కందుకూర్ నిర్మిస్తున్న చిత్రం 'ఫస్ట్ ర్యాంక్ రాజు'. 'విద్య 100% బుద్ధి 0%' అనేది ఉపశీర్షిక. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల జరిగింది. అతిథిగా విచ్చేసిన దర్శకుడు అనిల్ రావిపూడి ట్రైలర్‌ని విడుదల చేయగా, మరో దర్శకుడు మారుతి ఆడియో సీడీలను రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ, 'కన్నడలో మంచి విజయం సాధించిన ఈ సినిమా తెలుగులో కూడా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. చేతన్ సినిమా సినిమాకి మంచి పరిణతి సాధిస్తున్నాడు. టైటిల్ లాగే సినిమా కూడా మంచి మార్కులు పొందాలని కోరుకుంటూ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్' అని అన్నారు. 'ఈ సినిమాకి చాలా మంది హీరోలను అనుకున్నప్పటికీ నిర్మాతలు చేతన్ని ఎంపిక చేయడంతో అక్కడే మొదటి విజయం సాధించారు. ఈ పాత్రకి చేతన్ తప్ప వేరెవరు న్యాయం చేసేవారు కాదు. చాలా పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యారు. అందరు ఎంతో కష్టపడి ఈ సినిమాని మంచి క్వాలిటీగా తీశారు. ఈ సినిమా ద్వారా నిర్మాత మంజునాథ్, డైరెక్టర్ నరేష్ విజయం అందుకుని తెలుగులో మంచి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నా' అని మారుతి చెప్పారు.
దర్శకుడు నరేష్ మాట్లాడుతూ, 'ఈ సినిమా కోసం కష్టపడిన అందరికి థ్యాంక్స్. ఒక చిన్న ఐడియాతో మొదలైన ఈ సినిమా ఇంతవరకు వచ్చింది. లైఫ్‌లో విద్య మాత్రమే కాదు బుద్ధి కూడా ఉండాలన్న సందేశంతో సినిమా సాగుతుంది. ఈ సినిమా ఎక్కడా ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్స్‌ని కించపరిచేలా ఉండదు. స్టూడెంట్స్ అందరూ చూడాల్సిన సినిమా. తప్పకుండా అందరికీ నచ్చుతుంది' అని అన్నారు.
'సినిమా పట్ల ఉన్న ఫ్యాషనేట్తోనే ఈ చిత్రాన్ని నిర్మించాం. ఒక మంచి సినిమా తీస్తే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే ఉద్దేశంతోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఇక్కడ చాలా నేర్చుకున్నాను. ఈ సినిమాని అందరికి నచ్చేలా తీశాం. అందరు తప్పకుండా చూడండి' అని నిర్మాత మంజునాథ్ వి కందుకూర్ తెలిపారు.
హీరో చేతన్ మాట్లాడుతూ, 'నాకు ఈ అవకాశం ఇచ్చిన మంజునాథ్‌కి థ్యాంక్స్. సొంత కొడుకులా చూసుకున్నారు. సినిమా తప్పకుండా హిట్ అవుతుంది. అయనతో మళ్ళీ మళ్ళీ సినిమా చేయడానికి రెడీ. పెద్ద పెద్ద ఆర్టిస్ట్‌లు ఈ సినిమాకి సపోర్ట్ చేశారు. స్క్రిప్ట్‌ని నమ్మి చేసిన చిత్రమిది. మంచి కంటెంట్ ఉన్న సినిమా చూడనప్పుడు రొటీన్ సినిమాలు ఎందుకు వస్తున్నాయనే దానికి అర్హత లేదని నా నమ్మకం' అని చెప్పారు. హీరోయిన్ కశీష్ ఓరా చెబుతూ, 'నా కెరీర్లో నేను చేసిన బెస్ట్ స్క్రిప్ట్ ఇది. మంచి రోల్ చేశా' అని తెలిపింది.