Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్తికేయ హీరోగా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ప్రవీణ కడియాల సమర్పణలో స్ప్రింట్ ఫిల్మ్స్, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్, ఎస్జీ మూవీ మేకర్స్ పతాకంపై అనిల్ కడియాల, తిరుమల్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'గుణ 369'. అనఘ కథానాయిక. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలైంది. దీని గురించి దర్శకుడు మాట్లాడుతూ, 'టీజర్లో 'మనం చేసే తప్పుల వల్ల మన జీవితానికి ఏం జరిగినా ఫర్వాలేదు. కానీ పక్కనోడి జీవితానికి ఏ హానీ జరగకూడదు' అని సాయికుమార్ గంభీరమైన స్వరంతో చెప్పే మాటలు, హీరో అమ్మాయి ముందు నిల్చుని 'స్మైల్ ఇవ్వొచ్చు కదా ఒక్క సెల్ఫీ..', 'నేను ఎప్పుడూ అనుకోలేదండీ.. ఇలా బలవంతంగా షట్టర్ క్లోజ్ చేసి ఒకమ్మాయితో మాట్లాడతానని, నాతో మీరు మాట్లాడాల్సిన పనిలేదు. మీతో మీరు మాట్లాడేయండి' అని ప్రేమని వ్యక్తం చేస్తూ చెప్పే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. 'మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళను చూసి భయపడేది, గొడవలంటే మూసుకుని కూర్చునేది మాకేదన్నా అవుతుందని కాదు, మా.. అనుకున్న వాళ్ళకు ఏదన్నా అవుతుందన్న చిన్న భయంతో..'
అని హీరో చెప్పే డైలాగులు మాస్ ప్రేక్షకులతో చప్పట్లు కొట్టిస్తున్నాయి. విడుదలైన కొన్ని క్షణాల్లోనే టీజర్‌కి విశేష స్పందన వస్తుంది. బాగుందంటూ ప్రశంసిస్తున్నారు. టీజర్లో డైలాగులు, లొకేషన్లు, నటీనటుల పెర్ఫార్మెన్స్, కెమెరా, కాస్ట్యూమ్స్, ఇలా ప్రతి విషయం గురించి డీటైల్డ్‌గా మాట్లాడుతుంటే చాలా ఆనందంగా అనిపించింది. టీజర్ ఎంత బాగుందో, సినిమా అంతకు వెయ్యి రెట్లు బాగుంటుందని నమ్మకంగా చెప్పగలను. ఫస్ట్ లుక్కు, ఇప్పుడు టీజర్‌కు వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ చూసి యూనిట్ అంతా ఆనందంగా ఉన్నాం' అని చెప్పారు. 'మా టీజర్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. యువతకు కావాల్సిన అంశాలు, ఫ్యామిలీ కోరుకునే విషయాలు, మాస్ ప్రేక్షకులను నచ్చే సన్నివేశాల సమాహారంగా టీజర్ ఉందని, ఫుల్ మీల్స్ లాంటి సినిమా అవుతుందని ప్రశంసలు అందుతున్నాయి. ఇదే ఉత్సాహంతో ఈ నెలాఖరున పాటలను విడుదల చేస్తాం. మూడు రోజులు మినహా షూటింగ్ పూర్తయింది. ఆ సన్నివేశాలను కూడా త్వరలోనే తెరకెక్కిస్తాం. ఔట్పుట్ చాలా సంతృప్తికరంగా వచ్చింది. ప్రేక్షకులను ఆకట్టుకునే హిట్ సినిమా తీశామనే నమ్మకంతో ఉన్నాం. సినిమాకు సర్వత్రా పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. మా హీరో కెరీర్లోను, మా కెరీర్లోనూ ఈ సినిమా చెప్పుకోదగ్గ గొప్ప చిత్రమవుతుందనే నమ్మకం ఉంది' అని నిర్మాతలు తెలిపారు.