Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజరు దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న చిత్రం 'డియర్ కామ్రేడ్'. 'ఫైట్ ఫర్ వాట్ యు లవ్' అనేది ట్యాగ్ లైన్. భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి(సి.వి.ఎం), యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ని హీరో విజరు దేవరకొండ గురువారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'నాలుగు భాషల్లో ఈ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ అందరికి నచ్చిందనుకుంటున్నా. సినిమా విడుదలవుతుందంటే గత కొన్ని రోజులుగా నిద్రపట్టడం లేదు. సినిమాకి సంబంధించి మ్యూజికల్ ఫెస్ట్‌ని ఈ నెల 12న బెంగుళూరు, 13న కొచ్చి, 18న చెన్నై, 19న హైదరాబాద్‌లో నిర్వహించనున్నాం. మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకర్ బెస్ట్ ఆల్బమ్ ఇచ్చారు. సినిమా కోసం టీమంతా ఎంతో కష్టపడ్డాం. కచ్చితంగా ఆకట్టుకుంటుంది. రిజల్ట్‌ని ఎంజారు చేయాలనుకుంటున్నాం. అందుకే మంచి మ్యూజిక్‌ని ఆడియెన్స్‌తో కలిసి సెలబ్రేట్ చేయబోతున్నాం. కామ్రేడ్ అంటే మనం ఏ పనిచేసినా, కష్టసుఖాల్లో మనకు తోడుగా ఉండే వ్యక్తుల్ని, స్నేహితులను కామ్రేడ్ అంటాం. నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఆడియెన్స్ అభిమానం, ప్రేమ, సపోర్ట్. వాళ్ళంతా కామ్రేడ్సే. అందుకే వారికోసం మ్యూజిక్ సెలబ్రేషన్ నిర్వహించాలనుకుంటున్నాం. బెంగుళూరులో జరిగే ఈవెంట్‌కి రాకింగ్ స్టార్ యశ్ గెస్ట్‌గా హాజరు కానున్నారు. ఆయనకు థ్యాంక్స్' అని అన్నారు. 'ఇదొక బ్యూటిఫుల్ స్టోరీ. ఇందులో లిల్లీ పాత్రలో కనిపిస్తాను. దర్శకుడు భరత్ ఈ సినిమాతో బిజీ అవడమే కాదు, పెద్ద దర్శకుడవుతాడు. సినిమాలో పది నిమిషాల సన్నివేశాల కోసం మూడు, నాలుగు నెలలు క్రికెట్ నేర్చుకోవాల్సి వచ్చింది. డబ్బింగ్ చెప్పడానికి నాలుగు నెలలు పట్టింది. వండర్ఫుల్ టీమ్‌తో పనిచేసినందుకు చాలా హ్యాపీగా ఉంది' అని రష్మిక చెప్పారు.
చిత్ర దర్శకుడు భరత్ కమ్మ మాట్లాడుతూ, 'మూడేండ్లుగా దీనిపై వర్క్ చేస్తున్నాం. సపోర్ట్ చేసిన విజరుకి థ్యాంక్స్. సినిమా ఇంత బాగా రావడానికి కారణమైన మైత్రీ మూవీస్ నిర్మాతలకు, యశ్ రంగినేనిగారికి ధన్యవాదాలు. నేను మాట్లాడటం కంటే సినిమానే మాట్లాడుతుందనుకుంటున్నా' అని అన్నారు. నిర్మాత యశ్ రంగినేని చెబుతూ, 'ఈ సినిమా ద్వారా ఓ కొత్త విజరుని చూస్తారు. గత చిత్రాలకు పూర్తి భిన్నమైన పాత్రలో కనిపిస్తారు' అని చెప్పారు. మరో నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ, 'ట్రైలర్ అత్యద్భుతంగా వచ్చింది. అన్ని వర్గాల నుంచి మంచి స్పందన లభిస్తుంది. శుక్రవారం నుంచి మ్యూజిక్ ఫెస్టివల్ నిర్వహించాలని నిర్ణయించాం. ఈ నెల 22న వైజాగ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా చేయబోతున్నాం' అని తెలిపారు.