Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహేష్ సూర్య సిద్దగోని హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో బేబీ శ్రీ నిత్య సమర్పణలో సన్ మీడియా కార్పొరేషన్ పతాకంపౖౖె నిర్మిస్తున్న చిత్రం 'బడిదొంగ'. ఇషిక వర్మ కథానాయిక. రవికిరణ్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్ర లోగోను వ్యాపార వేత్తలు రవీందర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత మహేష్ సూర్య మాట్లాడుతూ, '22 ఏండ్లుగా ఈ రంగంలో ఉన్నా. ఈ టీవీలో 'నేరాలు ఘోరాలు'తో సహా పలు యాడ్ ఫిల్మ్స్ రూపొందించిన అనుభవంతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాను. ఒకప్పుడు రావణుడు సీతని అపహరిస్తే ఆంజనేయుడు లంకకి వెళ్లొచ్చాడు. రాముడే వెళ్తే ఏమిటనేది ఈ చిత్ర కథ. మూడేండ్లపాటు ఈ స్క్రిప్ట్‌పై వర్క్ చేశాను. రొమాంటిక్ లవ్ అండ్ యాక్షన్ చిత్రంగా రూపొందించనున్నాం. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి హైదరాబాద్, యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తాం' అని చెప్పారు. హీరోయిన్ ఇషిక వర్మ మాట్లాడుతూ, ''గోవిందుడు అందరివాడేలే', 'రారండోరు వేడుక చూద్దాం' లాంటి చిత్రాల్లో నటించాను. హీరోయిన్గా ఇదే నా తొలిచిత్రం. అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతకు ధన్యవాదాలు. ఈ చిత్రం సక్సెస్ అవ్వాలని ఆశిస్తున్నాను' అని చెప్పారు. 'ఇందులో నెగటివ్ రోల్ పోషించా. ఎస్వీ రంగారావు గారంటే ఇష్టం. ఆయన పోషించిన రావణుడి పాత్రకు దగ్గరగా ఉండే క్యారెక్టర్లో నటిస్తుండటం హ్యాపీగా ఉంది' అని నటుడు రవి కిరణ్ చెప్పారు. సంగీత దర్శకుడు చెబుతూ, 'సినిమాలో ఆరు పాటలున్నాయి. 'ఏదో ఏదో కొత్త వింత' అనే ఓ పాటను ఇప్పటికే రికార్డ్ చేశాం. మ్యూజికల్ హిట్‌గా నిలుస్తుందనే నమ్మకముంది' అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా వంశి.