Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అలియా భట్ అద్భుతమైన నటి మాత్రమే కాదు, మంచి గాయని కూడా. గతంలో ''హైవే', 'హంప్టీ శర్మ కి దుల్హానియా', 'ఉడ్తా పంజాబ్', 'డియర్ జిందగీ', 'బద్రీనాథ్ కి దుల్హానియా' చిత్రాల్లో తన మార్క్ గానంతో శ్రోతలను అలరించింది. తాజాగా తాను నటిస్తున్న 'సడక్ 2' చిత్రం కోసం మరోసారి ఓ రొమాంటిక్ సాంగ్‌ని ఆలపించబోతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన రిహార్సల్స్‌లో అలియా భట్ పాల్గొంటుంది. సంగీత దర్శకులు జీత్ గంగులీ సారథ్యంలో పాటని రఫ్‌గా ప్రయత్నిస్తున్నారు.
త్వరలో గోవాలో చిత్ర షూటింగ్ జరుగనుంది. అది పూర్తి చేసుకుని ఆగస్ట్‌లో వస్తారు. అప్పుడు
ఫైనల్ వెర్షన్ పాటని అలియా ఆలపించనున్నారట.
అందుకోసం ప్రస్తుతం ప్రాక్టీస్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. తన తండ్రి మహేష్ భట్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంజరు దత్, పూజా భట్, ఆదిత్యరారు కపూర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దీంతోపాటు అలియా ప్రస్తుతం 'బ్రహ్మాస్త్ర' తోపాటు తెలుగులోకి ఎంట్ర ఇస్తూ
'ఆర్ ఆర్ఆర్'లో నటిస్తూ బిజీగా ఉంది.