Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్తికేయ, అనఘ జంటగా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ప్రవీణ కడియాల సమర్పణలో స్ప్రింట్ ఫిల్మ్స్, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్, ఎస్జీ మూవీ మేకర్స్ పతాకాలపై అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'గుణ 369'. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని 'తొలి పరిచయమా ఇది.. తొలి పరవశమా ఇది.' అంటూ సాగే పాటని గురువారం ప్రముఖ నిర్మాత దిల్‌రాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ, 'పాట చాలా వినసొంపుగా ఉంది. మంచి మెలోడీ సాంగ్. అందరికి నచ్చుతుంది. కమల్‌హాసన్‌గారి 'గుణ', బాలకృష్ణ నటించిన 'ఆదిత్య 369'లను కలిసి ఈ చిత్రానికి టైటిల్‌గా పెట్టడం బాగుంది. కథకు తగ్గట్టు టైటిల్ కుదిరింది. 369 ఏంటో ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. కార్తికేయకు, ఈ చిత్ర బృందానికి 'ఆర్ ఎక్స్ 100' అంతటి విజయం దక్కాలని కోరుకుంటున్నా' అని అన్నారు. 'ఇదేదో వండి వార్చిన కథ కాదు. జరిగిన కథ. యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని తెరకెక్కించాం. అత్యంత రియలిస్టిక్‌గా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే చిత్రమిది. ఇది వరకు సిల్వర్ స్క్రీన్ మీద ఇలాంటి కథ రాలేదు. తాజాగా విడుదల చేసిన పాటని గేయ రచయిత విశ్వనాథ్ తేలిక పదాలతో మంచి భావంతో రాశారు. తప్పకుండా మంచి ప్రేమ గీతంగా ప్రజల్లోకి వెళ్తుంది' అని చిత్ర దర్శకుడు అర్జున్ జంధ్యాల తెలిపారు. నిర్మాతలు చెబుతూ, 'దిల్‌రాజు మా పాటని విడుదల చేయడం హ్యాపీగా ఉంది. గోల్డెన్ హ్యాండ్స్ మీదుగా బోణీ కొట్టిన మా ఆడియోకు తిరుగు ఉండదని నమ్ముతున్నాం. మా నమ్మకానికి తగ్గట్టు చైతన్ భరద్వాజ్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. మంచి ఫీల్ గుడ్ సాంగ్ ఇది. చిత్రంలోనూ యువతకు కావాల్సిన అంశాలు, ఫ్యామిలీ కోరుకునే విషయాలు, మాస్ ప్రేక్షకులను నచ్చే సన్నివేశాలు పుష్కలంగా ఉంటాయి. సినిమాకు సర్వత్రా పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. మా హీరోగారి కెరీర్లోనూ, మా కెరీర్లోనూ ఇది గుర్తుండిపోయే చిత్రమవుతుంది. ఆగస్ట్ 2న సినిమాని విడుదల చేయనున్నాం' అని చెప్పారు.