Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ నేను డామినేటింగ్ పర్సన్. ఆ విషయం తెలిసి కాలేజ్‌లో బారు ఫ్రెండ్స్ ఎవరూ నన్ను అల్లరి చేసేవారు కాదు' అని అంటోంది నభా నటేష్. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్, నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోహీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. ఈ నెల 18న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం నభా నటేష్ మీడియాతో ముచ్చటించింది.
ఆమె మాట్లాడుతూ, 'ఇందులో నేను చాందిని అనే సివిల్ ఇంజనీర్ పాత్రలో కనిపిస్తాను.
చాలా బోల్డ్‌గా ఉండే పాత్ర నాది. కన్స్ట్రక్షన్కి సంబంధించి రౌడీలు వచ్చి మామూళ్ళు అడుగుతుంటే వాళ్ళని నాదైన శైలిలో వార్నింగ్ ఇస్తుంటాను. భాష, యాస, నేపథ్యం అంతా పక్కా తెలంగాణ అమ్మాయిగా కనిపిస్తా. హైదరాబాద్, ఓల్డ్ సిటీలో పెరిగినట్టుగా అనిపిస్తుంది.
రెగ్యులర్‌కి భిన్నమైన పాత్ర కావడంతో భాష, యాసపై పట్టుకోసం, నా సీన్ డైలాగ్స్‌ని నెల రోజుల ముందునుంచి నేర్చుకున్నాను. తెలంగాణ యాస, బాడీ లాంగ్వేజ్ ప్రాపర్‌గా ఉండాలి. యాటిట్యూడ్ చూపించాలి. ఇలాంటి పాత్రలు చేయడం చాలా డిఫికల్ట్. బాగా కష్టపడాల్సి వచ్చింది. అందుకు రామ్ కూడా సెట్లో ఎంతో సపోర్ట్ చేశారు. పూరీ సర్ చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. సినిమాలో రామ్ నటించిన శంకర్, నా పాత్ర రెండూ డామినేటింగ్‌గా ఉంటాయి. పలు సందర్భాల్లో రామ్‌ని కొట్టాల్సి(ఫన్నీగా) వస్తుంది. అవి ట్రైలర్లో చూడొచ్చు. అంత మాస్‌గా ఉంటాను. సాధారణంగా పూరీ సినిమాలో హీరో రెబల్‌గా, డామినేటింగ్‌గా ఉంటాడు, హీరోయిన్ ఇన్నోసెంట్‌గా ఉంటుంది. కానీ ఇందులో మా రెండు పాత్రలు మాస్‌గా, చాలా ఎనర్జిటిక్‌గా ఉంటాయి. సినిమాల్లోనే కాదు, రియల్ లైఫ్‌లోనూ నేను అలానే ఉంటాను. అందుకే కాలేజ్ టైమ్‌లో ఎవరూ నన్ను అల్లరి చేయాలని ప్రయత్నించేవారు కాదు. సినిమాలో మాస్ ఎలిమెంట్స్‌తోపాటు సైన్స్ ఫిక్షన్ అంశాలుంటాయి. ఆ రెండూ పూర్తి విరుద్ధమైన అంశాలు.
కానీ సినిమాలో ఓ పద్ధతిగా, ఆడియెన్స్‌కి ఈజీగా కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించారు. డబుల్ దిమాక్ ఏంటనేది తెరపై చూడాలి. రామ్ తన పాత్రలో అద్భుతంగా నటించారు. ఆయన చెప్పే డైలాగులు ఆకట్టుకుంటాయి. ఆయన్ని సెట్లో కలిసినప్పుడే పాత్రలో లీనమైపోయాడు.
సినిమా కచ్చితంగా వినోదాన్ని పంచుతుంది. నిధితో నాకు సీన్స్ లేవు. 'దిమాక్ ఖరాబ్' పాటలోనే కలిసి నటించాం. సినిమాని చూసి ఎంజారు చేయాలని కోరుతున్నాం. ప్రస్తుతం రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందే 'డిస్కోరాజా'లో నటిస్తున్నా. పలు తెలుగు, తమిళ ప్రాజెక్ట్‌లకు చర్చలు జరుగుతున్నాయి. ఆ వివరాలు త్వరలో వెల్లడిస్తా' అని చెప్పారు.