Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీకాంత్ కీలక పాత్రలో, కమల్ కామరాజు, అజరు, శ్రీరాం, అలీ, కారుణ్య చౌదరి, సాయి తేజస్విని ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం 'ఎర్రచీర'. సత్య సుమన్ బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం బేబీ ఢమరి సమర్పణలో శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పాట చిత్రీకరణ జరుగుతుంది. ఆ విశేషాలను చిత్ర దర్శకుడు సత్య సుమన్‌బాబు మాట్లాడుతూ, 'శతాధిక చిత్రాల హీరో శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో కమల్ కామరాజు, అజరు, శ్రీరాం, అలీ పాత్రలు ఆకట్టుకుంటాయి. ఛేజింగ్ సీన్స్, హర్రర్ కామెడీ హైలైట్‌గా నిలుస్తాయి. ప్రస్తుతం సారధి స్టూడియోలో హీరోయిన్ ప్రియాంక అగస్టిన్, రఘుబాబు, ఫిష్ వెంకట్ సహా పలువురు ఆర్టిస్టుల బృందంపై ఐటెమ్ సాంగ్‌ని చిత్రీకరిస్తున్నాం. త్వరలో క్లైమాక్స్ చిత్రీకరణ పూర్తి చేయనున్నాం. షూటింగ్‌తోపాటు నిర్మాణానంతర పనులు కూడా పూర్తవుతున్నాయి. సెప్టెంబర్ 20న సినిమాని రిలీజ్ చేస్తాం' అని అన్నారు. 'హర్రర్ యాక్షన్, సస్పెన్‌గా సాగే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది' అని ఎగ్జిక్యూటివ్ నిర్మాత తోట సతీష్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: చందు, ఆర్ట్: సుభాష్, నాని.