Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ సంగీత దర్శకులు పెండ్యాల నాగేశ్వరరావు కంపోజ్ చేయగా, ఘంటసాల ఆలపించిన గొప్ప పాట 'శివశంకరీ'. దీన్ని ఆధునికంగా ఫ్యూజన్ కవర్ సాంగ్‌గా గాయకుడు అనుదీప్ అద్భుతంగా తీర్చిదిద్దాడు. రియల్ ఫ్యూజన్ అంటే ఇది అనేలా ఈ పాట ప్రజెంటేషన్ ఉంది' అని ప్రముఖ సంగీత దర్శకులు కోటి అన్నారు.
ప్రముఖ గాయకుడు అనుదీప్ తాజాగా కంపోజ్ చేసిన 'శివశంకరీ' ఫ్యూజన్ కవర్ సాంగ్ లాంచ్ ఇటీవల జరిగింది. అతిథిగా విచ్చేసిన కోటి ఈ ఫ్యూజన్ కవర్ సాంగ్‌ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'పెండాల్య, ఘంటసాల కాంబినేషన్లో శ్రోతల్ని విశేషంగా అలరించిన ఎన్నో పాటలున్నప్పటికీ 'శివశంకరీ' పాటకి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ పాట ఆశేష శ్రోతకాదరణ పొంది ఇప్పటికీ ఎవర్గ్రీన్ సూపర్‌హిట్ సాంగ్‌గా నిలిచించింది. అటువంటి పాటని నేటి ట్రెండ్‌కి అనుగుణంగా మలచడమనేది అభినందనీయ ప్రయత్నమనే చెప్పాలి. అనుదీప్ ఎప్పట్నుంచో తెలుసు. ఏదో చేయాలన్న తపనే అతన్ని ఈ సాహసం చేసేలా చేసింది. ఈ సాంగ్‌తో అనుదీప్ ఒక మంచి స్థాయికి చేరతాడు. ఒరిజినల్ సాంగ్‌ని ఏ మాత్రం చెడగొట్టకుండా చేయడం గొప్ప విషయం. ఈ సాంగ్‌ని నా చేతుల మీదుగా లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అనుదీప్‌కి మంచి పేరు రావాలని కోరుకుంటున్నా' అని అన్నారు. 'శివశంకరీ' పాటలోని సోల్ పోకుండా ప్రజంట్ చేసిన అనుదీప్‌కి నా అభినందనలు. ఈ పాటను పాడాలనుకోవడమే ఓ సాహసం. అలాంటిది సోల్ మిస్ అవకుండా రీమిక్స్ చేయడం మరో సాహసం. అనుదీప్ కచ్చితంగా మంచి సంగీత దర్శకుడు అవుతాడు. సింగర్‌గా ఏంటో తెలుసు. కంపోజర్‌గా కూడా తనేంటో త్వరలో చూడబోతున్నాం' అని మరో సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ తెలిపారు.
'ఏదైనా ఒక మంచి కవర్ సాంగ్ చేయాలనుకుంటున్న తరుణంలో 'శివశంకరీ' పాటని తీసుకుని ఫ్యూజన్ కవర్ సాంగ్ చేశాం. దీనికి ఆట సందీప్ కొరియోగ్రఫీ చేశారు. సహజంగా ఇటువంటి పాటలను సెలెక్ట్ చేసుకోవడానికి చాలా ధైర్యం కావాలి. అయితే ఇటువంటి పాటల్ని నేటి ట్రెండ్‌కి అనుగుణంగా రూపొందించగలిగితే మరింతగా శ్రోతల మనసుల్లో నిలిచిపోతాయి. మేం చేసిన ఈ ప్రయత్నం అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చి నన్ను బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్' అని అనుదీప్ చెప్పారు. ఈ కార్యక్రమంలో రఘు కుంచె, సాయి కార్తీక్, జెబి, రఘురామ్, రమ్య బెహర, మాళవిక, విజయలక్ష్మి, వేణు మనీషా ఎరబత్తిని తదితరులు పాల్గొని అనుదీప్ చేసిన ప్రయత్నాన్ని ప్రశంసించారు.