Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భిన్నమైన చిత్రాల్లో భాగమవుతూ కృతి సనన్ బాలీవుడ్లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అవుతోంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న సినిమాలన్నీ కంటెంట్ బేస్ట్‌గా ఉండటం విశేషం. తాజాగా మరో బలమైన
కథా నేపథ్యం ఉన్న చిత్రానికి కృతి పచ్చజెండా ఊపారు. రాహుల్ ధోలాకియా దర్శకత్వంలో
తెరకెక్కే ఈ సినిమాలో కృతి పాత్ర చాలా శక్తివంతంగా ఉంటుందట. థ్రిల్లర్ ప్రధానంగా సాగే ఈ సినిమా దేశంలో జరుగుతున్న మెడికల్ స్కామ్‌ని వెండితెర ఆవిష్కరబోతోందని సమాచారం. ఇందులో ఆర్జేగా కృతి కనిపించనున్నారట. డిఫరెంట్ వేలో ఈ మెడికల్ స్కామ్‌ని బయటపెట్టడానికి కృతి ఏం చేసిందనేదని ఆద్యంతం ఆసక్తికరమని చిత్ర వర్గాలు తెలిపాయి.