Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉదరు శంకర్, ఐశ్వర్య రాజేష్ జంటగా ఎస్.వి.నిర్మల్ కుమార్ దర్శకత్వంలో అధిరో క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి పతాకంపై జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ చిత్ర టీజర్‌ని ఇటీవల వెంకటేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
'టీజర్ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫ్యామిలీ అందరూ కలిసి చూడదగ్గ సినిమా అవుతుందని భావిస్తున్నాను. హీరో ఉదరు శంకర్‌కి నటుడిగా మంచి భవిష్యత్ ఉంది. కథ అందించిన భూపతిరాజాకి, చిత్ర బృందానికి అభినందనలు' అని అన్నారు. 'వెంకటేష్‌గారు మా చిత్ర టీజర్‌ని విడుదల చేయడం ఆనందంగా ఉంది. సినిమా అందరికి నచ్చుతుందని భావిస్తున్నా' అని దర్శకుడు తెలిపారు. హీరో ఉదరు శంకర్ చెబుతూ, 'నా మొదటి సినిమా 'ఆటగదరా శివ'కి వెంకటేష్‌గారు ఎంతో సపోర్ట్ చేశారు. ఈ సినిమా కోసం అందరూ కష్టపడి పనిచేశారు. భూపతిరాజా ఇచ్చిన కథను దర్శకుడు బాగా తెరకెక్కించారు. నిర్మాతలు సినిమాను రాజీ పడకుండా నిర్మించారు' అని తెలిపారు. నిర్మాత శ్రీరామ్ మాట్లాడుతూ, ' ఆడియెన్స్ కోరుకుంటున్న అన్నీ అంశాలు సినిమాలో ఉంటాయి. సినిమా బాగా వచ్చింది. డైరెక్టర్ ఎన్.వి.నిర్మల్ బాగా తీశారు. ఉదరు శంకర్, హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ చక్కగా నటించారు. త్వరలో ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు వెల్లడిస్తాం' అని చెప్పారు. రచయిత భూపతి రాజా మాట్లాడుతూ, 'ఈ సినిమా రెండు కుటుంబాల మధ్య జరిగే కథ. హీరో హీరోయిన్లు పోటీ పడి నటించారు' అని అన్నారు.