Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హరీష్ వినరు, తనిష్క తివారి జంటగా అనిల్ పి.జి.రాజ్ దర్శకత్వంలో తారా క్రియేషన్స్ పతాకంపై బ్రహ్మానందరెడ్డి నటిస్తూ నిర్మించిన చిత్రం 'బైలంపుడి'. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల జరిగింది. అతిథిగా విచ్చేసిన దర్శకుడు శివ నిర్వాణ రిలీజ్ పోస్టర్ ఆవిష్కరించి చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. మరో దర్శకుడు సాగర్ మాట్లాడుతూ, 'ఈ చిత్ర ట్రైలర్ చాలా బాగుంది. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా ఉందనిపిస్తుంది. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రమిది. ఇందులో చిత్ర నిర్మాత చేసిన పాత్ర ఆకట్టుకుంటుంది. సినిమా పెద్ద హిట్ కావాలి' అని అన్నారు. 'సినిమా మీద ప్యాషన్‌తో కొత్తవాళ్ళు రావడం మంచి విషయం. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫెంటాస్టిక్' అని అలీ చెప్పారు. చిత్ర నిర్మాత బ్రహ్మానందరెడ్డి చెబుతూ, 'ఈ సినిమా విడుదలవ్వడానికి నా చిత్ర యూనిట్‌తోపాటు ఇక్కడకి వచ్చిన ఎంతో మంది గెస్ట్‌లు చాలా హెల్ప్ చేశారు. రిలీజ్ విషయంలో డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్‌రెడ్డి సహకారం మరువలేనిది. ఈ సినిమాని అన్ని ఏరియాల్లో అమ్మేశాం. ఇండిస్టీలో యుద్ధం చేయాలి గెలవడానికి. సినిమాని చూసి ఆదరించాలని కోరుకుంటున్నా' అని చెప్పారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ, 'ఒక ఊర్లో జరిగే వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది. సందీప్ కుమార్ మంచి సంగీతంతోపాటు ఆర్.ఆర్ బాగా చేశారు. ఆర్టిస్టులంతా చాలా బాగా నటించారు. అన్ని వర్గాలకు నచ్చే చిత్రమవుతుంది' అని అన్నారు.