Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఓ కొత్త కథానాయికగా ''బోల్ చుడియన్'తో మళ్ళీ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాను'
అని అంటోంది తమన్నా. తెలుగు, తమిళంలో అగ్ర కథానాయికగా రాణిస్తున్న తమన్నా బాలీవుడ్‌లోనూ రాణించేందుకు చేసే ప్రయత్నంలో వెనకబడిపోయింది. తాజాగా నవాజుద్దీన్ సిద్ధిఖీ సరసన 'బోల్ చుడియన్' చిత్రంలో నటించే అవకాశాన్ని పొందింది. 'నవాజుద్దీన్‌తో నటించేందుకు ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నా. ఆయన నటించే విధానం, తనదైన నటనతో పాత్రని తెరపై
ఆవిష్కరించే తీరు చాలా అమేజింగ్‌గా ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యేలోపు
ఆయన నటనలోని రహస్యం ఏంటో తెలుసుకుంటా(నవ్వుతూ)' అని తెలిపింది. గాజులు అమ్ముకునే వ్యక్తికి, పల్లెటూరి అమ్మాయికి మధ్య సాగే ప్రేమ కథ నేపథ్యంలో రూపొందుతున్న
ఈ చిత్రంలో పల్లెటూరి అమ్మాయిగా తమన్నా కనిపించనుంది.