Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవీన్ రాజ్ శంకరపుడి, శశికాంత్, శ్రావ్య, శృతి హీరోహీరోయిన్లుగా భరత్.పి, నరేంద్ర దర్శకత్వంలో భవాని శంకర ప్రొడక్షన్స్ పతాకంపై బి.సంజరు కుమార్ నిర్మిస్తున్న చిత్రం 'వనవాసం'. ఈ చిత్ర ఆడియో లాంచ్ ఇటీవల జరిగింది. అతిథిగా విచ్చేసిన అల్లరి నరేష్ పాటల సీడీని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'యాక్టర్ అవుదామని వచ్చిన సంజరు కుమార్ నిర్మాత అయ్యారు. ఈ చిత్రాన్ని మొదట తన స్నేహితుడు నిర్మిస్తూ ఆయన మధ్యలో చనిపోవడంతో ఆ నిర్మాణ బాధ్యతలు సంజరు తీసుకున్నారు. ఈ దర్శకులు భరత్, నరేంద్రలకి అభినందనలు. వారికి మంచి పేరు రావాలి. మ్యూజిక్ డైరెక్టర్ మోహన్ అందించిన పాటలు బాగున్నాయి. సినిమా పెద్ద హిట్ కావాలి' అని అన్నారు. '20 ఏండ్ల క్రితం యాక్టింగ్ స్కూల్లో పరిచయమైన అల్లరి నరేష్ ఇప్పుడు నా సినిమాని ప్రోత్సహించడానికి రావడం చాలా ఆనందంగా ఉంది. దర్శకులు సినిమాని కష్టపడి అద్భుతంగా తెరకెక్కించారు. సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరి థ్యాంక్స్. సినిమాని సక్సెస్ చేయాలని కోరుతున్నా' అని నిర్మాత సంజరు కుమార్ చెప్పారు. డైరెక్టర్ భరత్ మాట్లాడుతూ, 'అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది. నిర్మాత సంజరు ఖర్చుకి వెనకాడకుండా తెరకెక్కించారు. మా ప్రయత్నాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నా' అని తెలిపారు. 'అల్లరి నరేష్ ఈ సినిమాని ప్రోత్సహించడం గొప్ప విషయం. ఈ మధ్య చిన్న సినిమాలే బాగా ఆడుతున్నాయి. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ గొప్పగా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ మోహన్ బాణీలు బాగున్నాయి. ఈ సినిమా సక్సెస్ అయ్యి టీమ్‌కి పేరు, నిర్మాత సంజరుకి డబ్బు తీసుకురావాలని కోరుకుంటున్నాం' అని నిర్మాతలు రాజ్‌కందుకూరి, టి.రామసత్యనారాయణ ఆకాంక్షించారు.