Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'డియర్ కామ్రేడ్'. 'ఫైట్ ఫర్ వాట్ యు లవ్' అనేది ట్యాగ్ లైన్. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం), యష్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ నెల 26న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ, 'దక్షిణాది భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఇటీవల ట్రైలర్‌ను విడుదల చేశాం. కంటెంట్, ఇంటెన్సిటి లవ్, ఎమోషన్స్ అన్నీ ఎలిమెంట్స్‌తో సినిమా ఉంటుందని తెలియజేసేలా ఉన్న ట్రైలర్‌కు ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు 13 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అలాగే ఇప్పటికే విడుదలైన సాంగ్స్‌కు, టీజర్‌కు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 12న బెంగుళూరు, 13న కొచ్చిలో జరిగిన మ్యూజిక్ ఫెస్టివల్స్ గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. బెంగుళూరులో యశ్ ముఖ్య అతిథిగా జరిగిన ఫెస్టివల్‌కి మంచి స్పందన లభించింది. ఈ నెల 18న చెన్నైలో, 19న హైదరాబాద్‌లో మ్యూజిక్ ఫెస్టివల్స్‌ను నిర్వహించనున్నాం. నాలుగు భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాతో విజరు దేవరకొండ దక్షిణాదిన సత్తా చాటడం ఖాయం' అని తెలిపారు.