Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్తికేయ, అనఘ జంటగా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ప్రవీణ కడియాల సమర్పణలో స్ప్రింట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్, ఎస్జీ మూవీ మేకర్స్ పతాకాలపై అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'గుణ 369'. ఈ చిత్రంలోని రెండో పాట 'బుజ్జి బంగారం..'ని హాస్య నటుడు బ్రహ్మానందం విడుదల చేసి చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ సందర్భంగా ఆలీ మాట్లాడుతూ, 'దర్శకుడు అర్జున్ జంధ్యాల, నేనూ కొలిగ్స్. ఇద్దరం కలిసి చాలా సినిమాలు చేశాం. ఇప్పటికే బుల్లితెరమీద సక్సెస్ అయిన నిర్మాతలు ఈ సినిమాతో వెండితెరపై కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నా. ప్రతి ఇంట్లోనూ హోమ్ మినిస్టర్ స్ట్రాంగ్‌గా ఉంటారు. కాబట్టి వాళ్ళని 'బుజ్జి.. బంగారం' అని పిలుస్తుంటాం. నేను కూడా అలానే పిలుస్తా.
అదే పదాలతో చైౖతన్ భరద్వాజ్ స్వరపరిచిన ఈ పాట బాగుంది. అందరూ పాడుకునేలా ఉంది. ఇది 'ఆర్ ఎక్స్ 100' కన్నా పెద్ద హిట్ కావాలి' అని అన్నారు. 'ప్రేమలో ఉన్న ప్రతి అమ్మాయి, అబ్బాయి పాడుకునేలా, వినగానే మంచి స్టెప్పులు వేసేలా ఈ పాట ఉంది. కామెడీ లెజండ్స్ బ్రహ్మానందం బ్లెస్ చేయడం, అలీ పాటను లాంచ్ చేయడం గొప్ప అనుభూతిని కలిగిస్తోంది. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఇలాంటి అరుదైన అవకాశం దొరకదు. పెద్దల ఆశీస్సులందుకున్న ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్ముతున్నా' అని హీరో కార్తికేయ చెప్పారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ, 'నాలుగ్గోడల మధ్య ఊహించి రాసుకున్న కథతో ఈ చిత్రాన్ని తీయలేదు. విశాల ప్రపంచంలో జరిగిన యధార్థగాథ మా చిత్రానికి ముడి సరుకయ్యింది. స్క్రీన్ మీద కూడా అంతే సహజంగా ఉంటుంది. ఆ సహజత్వం ప్రేక్షకుడి గుండెను తాకుతుంది. కామెడీ లెజెండ్స్ పాజిటివ్ మాటలు మాలో కొత్త ఉత్తేజాన్ని నింపాయి' అని చెప్పారు. 'తాజా పాట అందరికీ నచ్చుతుంది. నేడు (బుధవారం) అల్లు అరవింద్, బోయపాటి శ్రీను చేతుల మీదుగా ట్రైలర్‌ని విడుదల చేయనున్నాం. ఆగస్ట్ 2న సినిమాని రిలీజ్ చేస్తాం' అని నిర్మాతలు తెలిపారు.