Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇటీవల ఏ భాషా సినీ పరిశ్రమలో చూసినా బయోపిక్‌ల నిర్మాణం మరింత ఊపందుకుంది.
మిగిలిన వాటితో పోలిస్తే బాలీవుడ్లో వీటి జోరు చాలా ఎక్కువ. అంతేకాదు స్పోర్ట్స్ ప్రధాన బయోపిక్‌లకు బాలీవుడ్ కేరాఫ్ అయ్యిందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇప్పటివరకు గ్లామర్ పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించిన సోనాక్షి సిన్హా తొలిసారి ఓ బయోపిక్‌లో నటించబోతున్నారు. అది కూడా స్పోర్ట్స్ ప్రధాన బయోపిక్ కావడం విశేషం. గతేడాది పారా ఒలింపిక్ గేమ్స్‌లో షాట్‌పుట్‌లో గోల్డ్ మెడల్ సాధించిన మొదటి మహిళ దీపా మాలిక్ జీవితం ఆధారంగా రూపొందే బయోపిక్‌లో నటించేందుకు సోనాక్షి పచ్చ జెండా ఊపినట్టు సమాచారం. ఈ బయోపిక్ ప్రపోజల్ కంటే ముందే దీపాతో సోనాక్షి కి మంచి పరిచయం ఉంది. 'దీపా లవ్లీ లేడీ. ఆమెలో స్ట్రాంగ్ విల్ పవర్ ఉంది' అని దీపా గురించి సోనాక్షి ఇచ్చిన కాంప్లిమెంట్స్ దీపా బయోపిక్‌లో సోనాక్షి కచ్చితంగా నటిస్తుందనే వార్తలకు బలం చేకూరింది. అన్నీ కుదిరితో త్వరలోనే మనం కూడా సోనాక్షిని ఓ క్రీడాకారిణిగా చూడొచ్చు. ప్రస్తుతం 'ఖాందాని షఫఖానా', 'మిషన్ మంగళ్', 'దబాంగ్ 3', 'భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా' చిత్రాల్లో నటిస్తూ సోనాక్షి బిజీగా ఉంది.