Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'హాలీవుడ్ నటి మెరిల్ స్ట్రీప్‌ని నేను బాగా ఇష్టపడతా. ఎందుకంటే ఆమె ప్రతి సినిమాలో డిఫరెంట్ లుక్‌లో కనిపించి ఆకట్టుకుంటారు. 70 ఏండ్ల వయసులోనూ పూర్తి డిఫరెంట్ పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేసే విధానం మెస్మరైజ్ చేస్తుంది. అలాగే బాలీవుడ్లో దీపికా పదుకొనె ప్రయోగాత్మక నేచర్ అంటే ఇష్టం. ఆమె కళ్లు ఎంతో అందంగా ఉంటాయి. నేను చేసే ప్రతి పాత్రకి సంబంధించి, డాన్స్‌కి సంబంధించి నా వ్యానిటీ వ్యాన్‌లో రిహార్సల్ చేస్తుంటా. ముఖ్యంగా డాన్స్‌ని ప్రాక్టీస్ చేస్తా. దీంతో ఆ వ్యానిటీ వ్యాన్ షేక్ అవుతుంటుంది. బయటివాళ్ళు ఆ వ్యాన్ ఎందుకలా షేక్ అవుతుందని ఆశ్చర్యంగా చూస్తుంటారు' అని తమన్నా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.ప్రస్తుతం 'దట్ ఈజ్ మహాలక్ష్మి', 'సైరా నరసింహారెడ్డి', 'ఆనందో బ్రహ్మా' రీమేక్, విశాల్ సినిమాలో నటిస్తోంది.
అలాగే హిందీలో ఓ డాన్స్ నేపథ్య చిత్రంలోనూ నటించేందుకు గ్రీన్‌సిగల్ ఇచ్చింది.
'బోల్ చుడియన్' చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీతో కలిసి నటిస్తున్న విషయం విదితమే.