Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ఒకప్పుడు నేనొక సెలబ్రిటీతో డేటింగ్లో ఉన్నాను. కానీ దాన్ని ఎవరూ కనిపెట్టలేకపోయారు. ప్రస్తుతం ఎవరితోనూ ప్రేమలో లేను' అని అంటోంది సోనాక్షి సిన్మా. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్న 'మిషన్ మంగళ్' చిత్రంలో సోనాక్షి నటించింది. ఈ సందర్భంగా ఓ ఛాట్ షోలో 'ఇండిస్టీకి చెందిన సెలబ్రిటీతో డేటింగ్‌పై మీ అభిప్రాయం ఏంటి? అనే ప్రశ్నకు సోనాక్షి స్పందిస్తూ, 'ప్రేమ విషయంలో మా పేరెంట్స్ ఎప్పుడూ సానుకూలంగా ఉంటారు. నేనొక మంచి కుర్రాడిని ప్రేమించాలనేది వారి కోరిక. కానీ చిత్ర పరిశ్రమలో అలాంటి వారు లేరు. గతంలో ఇండిస్టీకి చెందిన ఓ వ్యక్తితో నేను డేటింగ్ చేశాను. కానీ దాన్ని ప్రపంచం గుర్తించలేకపోయింది. ఒకవేళ నేను ఎవరినైనా ప్రేమించి,అతను నన్ను మోసం చేస్తే, ఆ నెక్ట్స్ డే వరకు అతను జీవించి ఉండడు (నవ్వుతూ)' అని తెలిపింది. సోనాక్షి ప్రస్తుతం 'దబాంగ్ 3', 'ఖందాని షఫఖానా', 'భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.