Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రధారులుగా హేమంత్ మధుకర్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్స్ కార్పొరేషన్ పతాకాలపై టి.జి.విశ్వప్రసాద్, కోన వెంకట్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి 'నిశ్శబ్ధం' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ సందర్భంగా శనివారం ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. చిత్ర బృందం తెలియజేస్తూ, 'కెరీర్ ప్రారంభం నుంచి విభిన్న నేపథ్య చిత్రాలతో, పలు బలమైన పాత్రలతో మెప్పిస్తున్న అనుష్క మరో శక్తివంతమైన పాత్రని 'నిశ్శబ్ధం'లో చూడొచ్చు. అనుష్క చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 14 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మా చిత్ర టైటిల్, ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయడం ఆనందంగా ఉంది. టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ వంటి నటీనటులతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం రూపొందుతుంది. అమెరికాలోని సియాటల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయ్యింది. దీంతోపాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్స్ యునైటెడ్ స్టేట్స్లో జరుగనుంది. ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళం, హిందీ, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో ఒకే సారి ఈ ఏడాది చివర్లో గ్రాండ్‌గా విడుదల చేయాలనుకుంటున్నాం' అని అన్నారు. అంజలి, మైఖేల్ మాడ్యసన్, షాలిని పాండే, సుబ్బరాజు, శ్రీనివాస్ అవసరాల, హంట్ ఓ హరో ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, ఆర్ట్: చాడ్ రాప్టోర్.