Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ గేయ రచయిత శివగణేష్ కన్నుమూశారు. హైదరాబాద్లోని వనస్థలిపురంలోని తన నివాసంలో గుండెపోటుతో గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయన చాలా వరకు డబ్బింగ్ చిత్రాలకు పాటలు రాశారు. అందులో 'ప్రేమికుల రోజు', 'నరసింహ', 'జీన్స్', 'ఒకే ఒక్కడు', 'బార్సు', 'ఎంతవారుకాని', '7/జి బృందావన్ కాలనీ' వంటి సూపర్ హిట్ చిత్రాలున్నాయి. వీటితోపాటు తెలుగు, తమిళంలో దాదాపు వెయ్యికిపైగా చిత్రాలకు పాటలు రాసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన రాసిన పాటలు సైతం సూపర్ హిట్ అయ్యాయి. ఆయా సినిమాల విజయంలో కీలక భూమిక కూడా పోషించాయి. శివగణేష్కి భార్య నాగేంద్రమణి, కుమారులు సుహాస్, మానస్లున్నారు. ఆయన మృతికి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమకి చెందిన పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.