Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ప్రతి రాముడిలో ఓ రావణుడు ఉంటాడు. ప్రతి దసరాను రావణుడు జరుపుకుంటాడు' అని అంటున్నారు సైఫ్ అలీ ఖాన్. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం 'లాల్ కప్టాన్'. నవదీప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ నాగసాధువు పాత్రలో నటిస్తున్నారు. సాధువు వేషాధారణలో ఆయన గెటప్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. శుక్రవారం సైఫ్ పుట్టిన రోజుని పురస్కరించుకుని చిత్ర టీజర్‌ని విడుదల చేశారు. ఇందులో సైఫ్ ముఖానికి విబూది రాసుకుంటూ కనిపించగా, 'ప్రతి రాముడిలో ఓ రావణుడు ఉంటాడు. ప్రతి దసరాను రావణుడు జరుపుకుంటాడు' అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే డైలాగ్ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుంది. పౌరాణికం నేపథ్యంలో ప్రతీకారం తీర్చుకునే కథాంశంతో సినిమాని రూపొందిస్తున్నారు. ఎరోస్ ఇంటర్నేషనల్, కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అక్టోబర్ 11న సినిమాని విడుదల చేయనున్నారు. దీంతోపాటు సైఫ్ 'దిల్ బెచారా', 'జవానీ జానేమన్', 'తానాజీ: ది అన్సంగ్ వారియర్' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.