Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మంచి కథని చెప్పాలని గాని, ఏదో సందేశం ఇవ్వాలని గాని ఈ సినిమా చేయలేదు. స్క్రీన్‌ప్లే ప్రధానంగా కొత్త రకమైన ప్రయోగం చేశామనుకున్నాం. కానీ ఫలితం మరోలా ఉంటుందని ఊహించలేదు' అని అంటున్నారు శర్వానంద్. ఆయన హీరోగా నటించిన చిత్రం 'రణరంగం'. సుధీర్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం మీడియాతో శర్వానంద్ సంభాషించారు. ఆ విశేషాలు మీ కోసం..
ఆడియెన్స్ నుంచి మంచి స్పందన లభిస్తుంది. విడుదల రోజు మార్నింగ్‌షోకి డివైడ్ టాక్ వచ్చింది. మ్యాట్నీకి పర్వాలేదన్నారు. ఫస్ట్షోకి ఎబౌ యావరేజ్ టాక్ వచ్చింది. ఇప్పటికీ అలానే కంటిన్యూ అవుతుంది. రివ్యూస్, క్రిటిక్స్ నుంచి నెగటివ్ స్పందన వచ్చింది. టాక్‌తో సంబంధం లేకుండా కలెక్షన్లు వస్తున్నాయి. అంతిమంగా కలెక్షన్లే మాట్లాడతాయి.
సినిమాలో కథ లేదని, కథనం కన్ఫ్యూజింగ్గా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే మేం మంచి కథ చెప్పాలనిగాని, ఏదో సందేశం ఇవ్వాలనిగాని ఈ సినిమా చేయలేదు. రెగ్యులర్‌కి భిన్నంగా, కొత్తగా, స్క్రీన్‌ప్లే బేస్డ్ సినిమా చేయాలనే రూపొందించాం. ఓ స్టయిలీష్ యాక్షన్ సినిమా చేయాలని చేశాం. సినిమా కచ్చితంగా ఆడియెన్స్‌ని డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్‌నిస్తుందని భావించాం. మేం ఏదైతే అనుకున్నామో అదే చేశాం. కానీ స్క్రీన్‌ప్లే కన్ఫ్యూజ్ చేస్తుందని, కథ గురించి ఆలోచిస్తారని ఊహించలేదు. ఆ విషయంలో మిస్టేక్ చేశాం.
అదే బ్యాక్ ఫైర్ అయ్యింది.
సురేఖ(చిరంజీవి భార్య) ఆంటీ ఫోన్ చేసి ప్రశంసించారు. చాలా అందంగా కనిపించాననే కాంప్లిమెంట్ చాలా ఆనందంగా అనిపించింది. అయితే రివ్యూస్ పరంగా నెగటివ్‌గా ఉంది. ఆడియెన్స్ నుంచి పాజిటివ్‌గా ఉంది. ఏది నమ్మాలో, ఏంటో అర్థం కావడం లేదు. పూర్తి కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఒవరాల్‌గా రిజల్ట్ ఏంటనేది తెలియడానికి మరికొన్ని రోజులు పడుతుందనుకుంటున్నా.
ఈ సినిమాలోని పాత్రల కోసం ప్రత్యేకంగా కసరత్తులు ఏం చేయలేదు. గ్యాంగ్‌స్టర్ పాత్రకి సంబంధించిన గెటప్ చూసుకోగానే హుందాతనం వచ్చేసింది. వ్యక్తిగతంగా నాకు యంగ్‌స్టర్ ఇష్టం. ఇందులో చిరంజీవి అభిమానిగా కనిపిస్తా. ఆ పాత్ర కోసం 'ఘరానామొగుడు', 'అల్లుడా మజాకా' వంటి సినిమాల్లో చిరంజీవిగారి మేనరిజమ్‌ని ఫాలో అయ్యాను. అలాగే గ్యాంగ్‌స్టర్ పాత్రతోపాటు సినిమా మేకింగ్‌ని చాలా బాగా ఎంజారు చేశా. ఒకే పాత్రలో రెండు వేరియేషన్స్ చూపించడం నాకు ఫుల్ ఛాలెంజింగ్‌గా అనిపించింది.
సినిమాలో హింస ఎక్కువగా ఉందని, మీ పాత్ర నేపథ్యం సరిగా చూపించలేదనే కామెంట్లూ వినిపిస్తున్నాయి. అయితే మేం మొదట్నుంచి యాక్షన్ సినిమా అనే చెప్పాం. ట్రైలర్లో కూడా అదే చూపించాం. టీజర్, ట్రైలర్లో సాఫ్ట్‌గా చూపించి, సినిమాలో హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా పెట్టి ఫ్యామిలీ ఆడియెన్స్‌ని మోసం చేయాలనుకోలేదు. ఏదైతే తీశామో, అదే చూపించాం. ఇక నా పాత్ర నేపథ్యాన్ని కావాలనే చూపించలేదు. అలా చూపిస్తే రెగ్యులర్ అయిపోతుందనిపించింది. ఈ విషయంలోనూ మేం అనుకున్నది బ్యాక్‌ఫైర్ అయ్యింది. దీంతో పాత్ర చేసే పనులకు జస్టిఫికేషన్ మిస్ అయ్యిందంటున్నారు.
రివ్యూస్, క్రిటిక్స్‌ని గౌరవిస్తా. ఎందుకంటే నేను బాగా చేసిన సినిమాలను అప్రిషియేట్ చేశారు. శర్వా మంచి కథలు ఎంపిక చేసుకుంటున్నాడని రాశారు. బాగా లేకపోతే బాగాలేదనే రాశారు. ఇందులో కూడా నా నటన గురించి బాగా రాశారు. కొంత బాధ, కొంత సంతోషం ఉంది. ఈ సినిమా విషయంలో రివ్యూస్‌ని, క్రిటిక్స్‌ని ఏమాత్రం తప్పుపట్టడం లేదు.
కథల ఎంపికలో ప్రత్యేకంగా మార్పు అనేది లేదా ఓ జోనర్‌కి పరిమితమవ్వాలనే ఆలోచనగానీ లేదు. నేను మొదట్నుంచి విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ వచ్చాను. జోనర్స్ కూడా మార్చుకుంటూ వస్తున్నా. విజయం వచ్చాక నెక్ట్స్ ఎలాంటి సినిమా చేయాలనే సందిగ్ధం ఉంటుంది. ఆ టైమ్‌లో స్క్రిప్ట్ సెలక్షన్ పెద్ద టఫ్ జాబ్. అయినప్పటికీ స్క్రిప్ట్ సెలక్షన్లో ఫైనల్‌గా నాదే నిర్ణయం.
ప్రస్తుతం తమిళంలో విజయం సాధించిన '96' రీమేక్‌లో నటిస్తున్నా. ఇది సగం షూటింగ్ పూర్తయ్యింది. దీంతోపాటు కొత్త దర్శకుడు కిషోర్ డైరెక్షన్లో 'శ్రీకారం' సినిమా చేస్తున్నా.
అద్భుతమైన కథ ఇది. సినిమా ప్రారంభమైంది. అలాగే తెలుగు, తమిళంలో ఓ బైలింగ్వల్ చేస్తున్నా. దీనికి మరో నూతన దర్శకుడు కార్తిక్ దర్శకత్వం వహిస్తారు. ఇకపై మంచి కంటెంట్‌తోపాటు పర్ఫామ్ చేయటానికి మాక్సిమమ్ స్కోప్ ఉన్న ఉండే పాత్రలను ఎంపిక చేసుకోవడానికి ప్రయత్నిస్తాను.