Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అంజలి, ఆండ్రియా, వసంత్ రవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'తారామణి'. రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జె.ఎస్.కె ఫిల్మ్ కార్పొరేషన్ సమర్పణలో డి.వి.సినీ క్రియేషన్స్, లక్ష్మీ వెంకటేశ్వర ఫ్రేమ్స్ బ్యానర్‌పై ఉదరు హర్ష వడ్డేల్ల, డి.వి.వెంకటేష్ సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ, 'ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. సినిమాలో ఎమోషనల్ కంటెంట్‌తో పాటు అన్ని ఎలిమెంట్స్ సమపాళ్లలో ఉంటాయి. ప్రతి సన్నివేశం మనసును హత్తుకునేలా ఉంటుంది. ప్రస్తుతం సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో సినిమా సాగుతుంది. టెక్నాలజీ మాయలో పడి యువత ఎలా ప్రవర్తిస్తున్నారు?, ఎలాంటి ప్రలోభాలకు లోనవుతున్నారు?, ఫలితంగా వారెలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారనే అంశాలతోపాటు యువతను మెప్పించే ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. ఈ సినిమా ట్రైలర్‌ను యూనివర్సల్ హీరో కమల్ హాసన్, పాటలను సూపర్‌స్టార్ రజనీకాంత్ విడుదల చేశారు. ట్రైలర్, పాటలకు ఆడియెన్స్ నుండి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబరు 6న సినిమాను విడుదల చేస్తున్నాం' అని చెప్పారు.