Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నేను రజనీకాంత్‌కి పెద్ద అభిమానిని. ఆయన నటనంటే ఇష్టం. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకునే ఇండిస్టీలోకి వచ్చాను' అని అంటున్నారు హీరో శేఖర్ వర్మ. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం 'నివాసి'. వివియ, విద్య హీరోయిన్లుగా సతీష్ వేగళ్ళ దర్శకత్వంలో కె.ఎన్.రావు, టి.వి.వి.ఎస్.ఎన్ వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ నెల 23న సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా హీరో శేఖర్ వర్మ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, 'ఇంతకు ముందు 'శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట'లో హీరోగా నటించాను. అందులో నా నటనకు మంచి పేరొచ్చింది. ముఖ్యంగా ఎమోషన్స్‌ని బాగా పండించానని అంతా ప్రశంసించారు. ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా వచ్చిన 'జై సింహా'లో కీలక పాత్ర పోషించా. ఇందులో సంపన్న కుటుంబంలో జన్మించిన నేను డబ్బు విలువ తెలియకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా పెరుగుతాను. నాకు డబ్బు విలువ, రిలేషన్స్, జీవితం విలువేంటో తెలియాలని మా నాన్న రెండు లక్షలు ఇచ్చి ఇండియా పంపిస్తాడు. పలు కండీషన్స్‌తో ఫారెన్ నుంచి ఇండియా వచ్చిన నేను ఇక్కడ ఏం తెలుసుకున్నాననేది ఆసక్తికరం. నా మూలాలను అన్వేషించే క్రమంలో నేను ఎలాంటి విషయాలు తెలుసుకున్నాననేది సినిమా. రాజు కథల్లో రాజు తన కుమారుడిని రాజ్యం మొత్తం తిరిగి రమ్మని చెప్పి, అలా తిరిగి వచ్చాక రాజ్యానికి యువరాజులా పట్టాభిషేకం చేయిస్తారు. ఆ కథ మాదిరిగానే ఈ సినిమా సాగుతుంది. తండ్రీతనయుల మధ్య అనుబంధం నేపథ్యంలో లవ్, మెసేజ్, ఫ్రెండ్షిప్, సోషల్ సర్వీస్, ఎంటర్టైన్మెంట్స్ మేళవింపుగా ఉంటుంది. నా పాత్ర విభిన్నంగా ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో 'ఏబీసీడీ', 'గౌతమ్‌నందా' వంటి చిత్రాలొచ్చినా వాటికి పూర్తి భిన్నంగా ఈ చిత్ర కథ, కథనాలుంటాయి. ఇదొక కొత్తరకమైన స్టోరీ ఇది. ఒక వ్యక్తి సంపూర్ణమైన జీవితాన్ని చెబుతున్నాం. సినిమాలో ప్రతి పాత్రకి మంచి ప్రాధాన్యత ఉంటుంది. వివియ పాత్ర చాలా మెచ్యూర్డ్‌గా ఉంటుంది. సినిమా చాలా బాగా వచ్చింది. దర్శకుడు సతీష్ సినిమాని అద్భుతంగా మలిచారు. మేమిద్దరం మంచి స్నేహితులం. మంచి ఫీల్‌గుడ్ చిత్రమవుతుంది. నెక్ట్స్ ఈ బ్యానర్లోనే మరో రెండు సినిమాలు 'అంగుళిక', 'యుగన్'లో నటిస్తున్నా. 'అంగుళిక' గ్రాఫిక్స్ ప్రధానంగా సాగుతుంది. ఈ సినిమాలో ప్రియమణి గెస్ట్ పాత్రలో కనిపిస్తారు. 'యుగన్' యాక్షన్ నేపథ్యం సాగే చిత్రం. తెలుగు, తమిళంలో రూపొందుతుంది. ప్రస్తుతం చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తున్నా. ప్రాధాన్యత కలిగిన నెగటివ్ రోల్స్ వచ్చినా చేసేందుకు సిద్ధమే' అని చెప్పారు.