Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వంశీ యాకసిరి, స్టెఫీ పటేల్ జంటగా అనిల్ తోట దర్శకత్వంలో ఎస్ఎల్ఎన్ ప్రొడక్షన్స్, నేదురుమల్లి ప్రొడక్షన్స్ పతాకాలపై ఓబిలేష్ మొదిగిరి, నేదురుమల్లి అజిత్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'నిన్ను తలచి'. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా గురించి మంగళవారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో దర్శకుడు అనిల్ తోట మాట్లాడుతూ, 'మంచి ఫీల్‌గుడ్ లవ్ స్టోరీ ఇది. ఇప్పటికే విడుదల చేసిన నాలుగు పాటలకు మంచి స్పందన లభించింది. మరో రెండు పాటలను మంగళవారం విడుదల చేశాం. హీరో వంశీ కొత్తవాడైనా సహజమైన నటన ప్రదర్శించారు. స్టెఫీ నటన సూపర్బ్. నిర్మాత అజిత్ రాజీ పడకుండా నిర్మించారు. గీతా ఆర్ట్స్ సపోర్ట్‌తో సెప్టెంబర్‌లో సినిమాని విడుదల చేస్తున్నాం. బన్నీవాసుకి ధన్యవాదాలు' అని అన్నారు. 'దర్శకుడు అనిల్ చెప్పిన స్క్రిప్ట్ బాగా నచ్చింది. చిత్రీకరణ అంతా ఫ్యామిలీ వాతావరణంలో హ్యాపీగా సాగింది. సంగీత దర్శకుడు యేలేందర్ మంచి పాటలను అందించారు. బడ్జెట్‌ని ఏమాత్రం పెంచకుండా అనుకున్న దానిలో పూర్తి చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. సపోర్ట్ చేయాలని కోరుతున్నా' అని నిర్మాత అజిత్ తెలిపారు.
హీరో వంశీ చెబుతూ, 'ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం కావడం చాలా హ్యాపీగా ఉంది. ప్రస్తుతం తెలుగు సినిమా స్థాయి పెరిగింది. దేశం మొత్తం మన వైపు చూస్తున్నారు. 'బాహుబలి', 'సాహో', 'సైరా'తో మనమేంటో తెలుస్తుంది. మంచి ఫీల్‌గుడ్ లవ్ స్టోరీగా దర్శకుడు అనిల్ సినిమాని అత్యద్భుతంగా తెరకెక్కించారు. మిస్ ఇంటర్నేషనల్ అయిన స్టెఫీతో కలిసి నటించడం నా అదృష్టంగా భావిస్తున్నా. యేలేందర్ సంగీతం సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. ఇది ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే చిత్రమవుతుంది' అని చెప్పారు. హీరోయిన్ స్టెఫీ పటేల్ చెబుతూ, 'ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. వంశీతో పనిచేయడం కంఫర్ట్‌గా అనిపించింది. సౌత్ ఇండిస్టీ అంటే నాకు చాలా ఇష్టం. ఈ బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ అన్ని వర్గాలను అలరిస్తుంది' అని చెప్పారు. 'ఇది కచ్చితంగా ఓ మ్యూజికల్ హిట్‌గా నిలుస్తుంది. టైటిల్ సాంగ్ హైలైట్ అవుతుంది' అని సంగీత దర్శకుడు యేలేందర్ తెలిపారు.