Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయ్ రాజా, పూజా సోలంకి, సాషా సింగ్ హీరోయిన్లుగా కె.రమాకాంత్ దర్శకత్వంలో వెట్‌బ్రెయిన్ ఎంటర్టైన్మెంట్స్, సుధర్మ్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం 'ఏదైనా జరగొచ్చు'. తమిళ నటుడు బాబీ సింహ నెగటివ్ రోల్ పోషించిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక సోమవారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శివాజీ రాజా మాట్లాడుతూ, 'గత ఆరు నెలల నుండి చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేకుండా కేవలం స్టోరీ, కంటెంట్ బాగున్న సినిమాలే విజయం సాధించాయి. దాదాపు 35 సంవత్సరాల క్రితం నేను 'కళ్ళు' అనే చిత్రంతో హీరోగా పరిచయం అయ్యా. ఆ సినిమా నాకు 17 అవార్డ్స్ తెచ్చి పెట్టింది. ఆ సినిమాకి గొల్లపూడి, రఘులే హీరోలని నేను ఇప్పటికీ చెబుతుంటాను. ఎందుకంటే రచయిత, దర్శకుడే సినిమాకి ప్రాణం. ఈ సినిమాకి కూడా దర్శకుడు రమాకాంతే హీరో. బాబీసింహా గారు అత్యున్నత నటులు. మ్యూజిక్ చాలా బాగుంది. ఆర్టిసులు, టెక్నీిషియన్స్ అందరికీ ఆల్ ది బెస్ట్' అని అన్నారు.
'ఈ కథ వినగానే నాకు గూస్బమ్స్ వచ్చాయి. స్క్రీన్ ప్లే, సీన్స్ తీసిన విధానం చాలా బాగుంటుంది. కథను దర్శకుడు ఎలా ఆలోచించారు?, ఎలా సీన్లు రాసుకున్నారు?, వాటిని ఎలా కనెక్ట్ చేశారు? అనేది నాకు ఇప్పటికీ సర్ప్రైజింగ్గా ఉంది. విజరు మంచి నటుడు. తొలి చిత్రమైనా ఎలాంటి బెరుకు లేకుండా నటించాడు' అని బాబీ సింహా తెలిపారు.
దర్శకుడు కె.రమాకాంత్ మాట్లాడుతూ, 'ఇదొక డార్క్ కామెడీ హర్రర్ థ్రిల్లర్. ఏప్రిల్ 1న పుట్టి స్టుపిడ్ పనులు చేసే ముగ్గురి జీవితాలు అనుకోని సంఘటన వల్ల ప్రమాదంలో పడితే, ఆ ప్రమాదం నుండి ఎలా బయటపడ్డారనే పాయింట్‌తో ఈ కథ రాసుకున్నా. తెలుగు స్క్రీన్ మీద ఇప్పటి వరకు మీరు చూడని లవ్ స్టోరీ ఈ సినిమాలో చూడబోతున్నారు. జాషువా మాస్టర్ కంపోజ్ చేసిన యాక్షన్ సీన్లు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. ఈ నెల 23న విడుదల కానున్న సినిమా అన్ని వర్గాలను అలరిస్తుందని నమ్ముతున్నా' అని చెప్పారు.
''జిగర్తాండ'లో బాబీ సింహా నటన చూసి, ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలనిపించింది. కానీ నా మొదటి సినిమాకే ఆయనతో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నా. సంగీతం, ఆర్ ఆర్, విజువల్స్ సినిమాకు హైలైట్. ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా' అని హీరో విజరు రాజా తెలిపారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ శ్రీకాంత్ పెండాల్య, కో ప్రొడ్యూసర్ సుదర్శన్ హనగోడు, పూజ సోలంకి , సాషా సింగ్, ఫైట్ మాస్టర్ జాషువా, ఎడిటర్ ఎస్.బి.ఉద్దవ్, రచ్చరవి పాల్గొని సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.