Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తరుణ్ తేజ్, లావణ్య జంటగా నవీన్ నాయని దర్శకత్వంలో గోల్డ్ టైమ్ ఇన్ పిక్చర్స్ పతాకంపై
డా|| లింగేశ్వర్ నిర్మిస్తున్న చిత్రం 'ఉండిపోరాదే'. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం గురించి
నిర్మాత లింగేశ్వర్ మాట్లాడుతూ, 'మంచి ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్. సెన్సార్ పూర్తి చేసుకొని
'యు' సర్టిఫికేట్ పొందింది.
ఈ మధ్యకాలంలో ఒక మంచి సినిమా
చూశామని సెన్సార్ వాళ్ళు అభినందించడం హ్యాపీగా ఉంది. నేను గతంలో చెప్పినట్టు సినిమా 100% సక్సెస్ అవుతుందనే నమ్మకం మరింత పెరిగింది. నటీనటులు అందరూ కొత్తవారే అయినా కథని నమ్మి ఈ సినిమా నిర్మించా. చివరి 20నిమిషాలు ప్రేక్షకులు తమ ప్రపంచాన్నంతా మర్చిపోయి చూసేలా ఉంటుంది. ఫ్యామిలీకి సంబంధించి ఒక అద్భుతమైన కథాంశంలో దర్శకుడు నవీన్ ప్రతి ఫ్రేమ్‌ని ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా తీశారు. అలాగే మా ఎడిటర్ జె.పి, డిఓపి శ్రీనివాస్ చాలా సపోర్ట్ చేశారు. హీరోహీరోయిన్ల కోసమే ఈ సినిమా పుట్టిందా? అనేంతగా పోటీపడి మరీ నటించారు. నటించిన అందరి కెరీర్లో ఇదొక ఉత్తమ చిత్రంగా నిలిచిపోతుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ నెల 31న సినిమాని విడుదల చేస్తున్నాం. సినిమాని థియేటర్లో చూసి హిట్ చేయాలని కోరుకుంటున్నా' అని అన్నారు. 'ఇంత మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాత లింగేశ్వర్కి థ్యాంక్స్. మేము అనుకున్న దాని కన్నా బాగా, హార్ట్ టచింగ్‌గా సినిమా వచ్చింది. కచ్చితంగా అన్ని వర్గాలను ఆకట్టుకునే చిత్రమవుతుంది' అని చిత్ర దర్శకుడు నవీన్ తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: శ్రీనివాస్ విన్నకోట, ఎడిటర్: జె.పి, మ్యూజిక్ : సాబు వర్గీస్, ఆర్ ఆర్: యేలెందర్ మహావీర్.