Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సినిమా అద్భుతమైన కలెక్షన్లతో దూసుకుపోతుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ఉంది. మౌత్ పబ్లిసిటీతో ఇంకా థియేటర్స్ పెంచారు. మా బ్యానర్లో మరో మంచి క్వాలిటీ చిత్రమిది. పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. చాలా చోట్ల నాని కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్, అలాగే లాంగ్ రన్లో కూడా బెస్ట్ కలెక్షన్స్ సాధిస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం
- నిర్మాత నవీన్ ఎర్నేని
నాని, ప్రియాంక జంటగా విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ సంయుక్తంగా నిర్మించిన 'గ్యాంగ్ లీడర్'
శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో హీరో నాని మాట్లాడుతూ, 'సినిమా విడుదల టైమ్‌లో వినాయక నిమజ్ఞనం ఉందన్నారు. దీంతోపాటు రకరకాల విషయాలు మమ్మల్ని భయపెట్టాయి. 'ఫీల్డర్స్ లేని గ్రౌండ్లో ఫోర్ కొడితే కిక్కే ఉండదు' అని 'నేను లోకల్' సినిమాలో చెప్పిన డైలాగ్ ఈ సందర్భంగా గుర్తొస్తుంది. ఎన్ని అడ్డంకులు ఉన్నా ప్రతి షోకి గ్రాఫ్ పెరుగుతూ వస్తుంది. మార్నింగ్ షోస్ కూడా ఫుల్ అయ్యాయి. ఇప్పటిదాకా మేం మాట్లాడాం.
ఇక సినిమా మాట్లాడుతుంది. సినిమాని ఓన్ చేసుకొని ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ థాంక్స్. సినిమా రిలీజైనప్పడి నుండి సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. దీన్ని నిజమైన గెలుపుగా భావిస్తున్నాం. ప్రతి రివ్యూలోను కార్తికేయ పెర్ఫామెన్స్‌ని, వెన్నెల కిషోర్ కామెడీని మెచ్చుకుంటున్నారు. మొదటి సినిమాతోనే ప్రియాంకకి ఫ్యాన్ క్లబ్ వచ్చేసింది. అలాగే మైత్రీ మూవీ మేకర్స్‌కి మరో హిట్ పడిందనే మెసేజ్ చూసి హ్యాపీగా అనిపించింది. ఈ సినిమాకి కార్తికేయ ఎంత ప్లస్ అయ్యాడో నాకు తెలుసు. సినిమా ఈ రేంజ్లో హిట్ అవుతుందనుకోలేదు. ఫ్యామిలీస్ బాగా ఎంజారు చేస్తున్నారు. రిలీజ్ టెన్షన్ లేకుండా మాకు ఇంతటి పాజిటివిటీని ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు' అని అన్నారు. 'సినిమాకి వస్తున్న స్పందన చూసి హ్యాపీగా ఉందని చెప్పడం చిన్న పదం. ఈ సినిమాలో చేస్తున్నప్పుడు రకరకాల కామెంట్స్ వచ్చాయి. కానీ సినిమా చేస్తున్న క్రమంలో నాది సరైన నిర్ణయమనిపించింది. ఇంత పెద్ద రిజల్ట్‌ని ఎక్స్పెక్ట్ చేయలేదు. నా క్యారెక్టర్‌కి, ముఖ్యంగా నా నటనకి స్పందన రావడం కిక్ ఇచ్చింది. నానికి, విక్రమ్ సర్కి థ్యాంక్స్' అని కార్తికేయ చెప్పారు. 'థియేటర్లో సినిమాని ఎంజారు చేయండి' అని దర్శకుడు విక్రమ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో చెర్రీ, ప్రియాంక, కెమెరామెన్ మిరోస్లా కుబా బ్రోజెక్, రవిశంకర్ తదితరులు పాల్గొని తమ ఆనందాన్ని పంచుకున్నారు.