Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఇప్పటికే 'సింహ', 'లెజెండ్' చిత్రాలొచ్చి అఖండ విజయం సాధించాయి. తాజాగా మూడోసారి వీరి కాంబినేషన్లో సినిమా రాబోతుంది. ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని ఆదివారం అధికారికంగా ప్రకటించారు.
'బాలకృష్ణ నటిస్తున్న 106వ చిత్రమిది. దీని కోసం దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ఫుల్ స్టోరీని సిద్ధం చేశారు. కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు ప్రస్తుతం సమాజంలోని ప్రధానమైన సమస్య ఆధారంగా ఇది సాగుతుంది. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్‌ని ప్రారంభించనున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి 2020 వేసవి చివరలో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లో బాలకృష్ణ పవర్ఫుల్ లుక్స్ అందరినీ మెప్పించాయి. అలాంటి మరో పవర్ఫుల్ లుక్‌లో బాలకృష్ణని ఈ చిత్రంలో బోయపాటి చూపించనున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కబోతున్న ఈ సినిమా కచ్చితం హ్యాట్రిక్ హిట్ ఖాయం. ఇందులో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం' అని చిత్ర బృందం తెలిపింది.