Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరుణ్‌ధావన్, శ్రద్ధాకపూర్ జంటగా నటిస్తున్న డాన్స్ ప్రధాన చిత్రం 'స్ట్రీట్ డాన్సర్ 3డి'. రెమో డిసౌజా దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రానికి సంబంధించి కొత్త పోస్టర్‌ను చిత్ర బృందం మంగళవారం రిలీజ్ చేసింది. డాన్స్ నేపథ్యంలో రూపొందిన 'స్ట్రీట్ డాన్సర్', 'స్ట్రీట్ డాన్సర్ 2' చిత్రాలు విశేష ప్రేక్షకాదరణ పొంది మంచి విజయాల్ని సాధించాయి. వీటికి కొనసాగింపుగా 'స్ట్రీట్ డాన్సర్ 3డి' చిత్రం తెరకెక్కుతోంది. అయితే 'స్ట్రీట్ డాన్సర్ 2'లో నటించిన వరుణ్, శ్రద్ధా జంట ఈ చిత్రంతోనూ మరోసారి సిల్వర్ స్క్రీన్ మీద మ్యాజిక్ చేయబోతున్నారు. దీపావళి కానుకగా ఈచిత్ర టీజర్‌ను రిలీజ్ చేసేందుకు దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈచిత్రం వచ్చే ఏడాది జనవరి 24న విడుదల కానుంది. వరుణ్ ఈ చిత్రంతోపాటు 'కూలీ నెం.1' రీమేక్‌లో నటిస్తున్నారు. అలాగే శ్రద్ధా మరోసారి టైగర్ షరాఫ్‌తో కలిసి 'బాఘీ 3'లో నటిస్తోంది.