Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయ్ దేవరకొండ, క్రాంతి మాధవ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రానికి 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై కె.ఎ.వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్ థ్రెస్సా, ఇజాబెల్లా లెయితే కథానాయికలుగా నటిస్తున్నారు. టైటిల్ ఎనౌన్స్మెంట్ సందర్భంగా ఈ చిత్రం గురించి యూనిట్ తెలియజేస్తూ, 'డైరెక్టర్ క్రాంతి మాధవ్ ఒక సెన్సిబుల్ కథాంశంతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే టైటిల్‌ని ఎందుకు పెట్టారు?, టైటిల్ జస్టిఫికేషన్ ఎలా చేశారని తెలుసుకోవాలంటే కచ్చితంగా సినిమా చూడాల్సిందే. ఈనెల 20 సాయంత్రం 5 గంటలకు ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడు గోపీసుందర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా, గుమ్మడి జయకృష్ణ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు'
అని తెలిపింది.