Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'పెదనాన్న (చిరంజీవి) బయోపిక్ చేస్తానని హరీష్ శంకర్ అన్నారు. చిరంజీవిగా రామ్‌చరణ్ అన్నయ్య బాగా సూట్ అవుతారు. ఒకవేళ ఆయన చేయకపోతే నేనే చేస్తా' అని చెబుతున్నారు హీరో వరుణ్ తేజ్. భిన్న నేపథ్య కథా చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు పొందిన వరుణ్ తేజ్ ప్రస్తుతం 'వాల్మీకి' చిత్రంలో నటించారు. తమిళంలో ఘన విజయం సాధించిన 'జిగర్తాండ' చిత్రానికి ఇది రీమేక్. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 20న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా బుధవారం వరుణ్ తేజ్‌తో మీడియా జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..
ఈ సినిమా ఎలా వర్కౌట్ అయ్యింది?
- కెరీర్ ప్రారంభం నుంచి విభిన్న కథా చిత్రాలు చేస్తున్నాను. 'ఫిదా', 'తొలిప్రేమ' తర్వాత లవ్ స్టోరీస్‌కి బ్రేక్ చెప్పాలనుకున్నా. కానీ ఆ తర్వాత చాలా మంది లవ్‌స్టోరీస్ చెప్పారు. హరీష్ శంకర్ కూడా 'దాగుడు మూతలు' పేరుతో ఓ లవ్‌స్టోరీ నెరేట్ చేశారు. కథ చాలా బాగుంది. అయితే మళ్ళీ వెంటనే లవ్ స్టోరీస్ చేయడం ఇష్టం లేదు. 'మీ తరహా మాస్ ఎంటర్టైనర్ చేయాలనుకుంటున్నాన'ని హరీష్‌తో అన్నప్పుడు 'జిగర్తాండ' సినిమాని చూడమన్నారు. అప్పటికే చూసినప్పటికీ హరీష్ కోసం మరోసారి సినిమా చూశా. దాదాపు 8 గంటలు డిస్కస్ చేసిన తర్వాత 'వాల్మీకి'కి ఫిక్స్ అయిపోయాం.
నెగటివ్ షేడ్ పాత్రని చేయటానికి రీజన్?
- ఇదొక అద్భుతమైన కల్ట్ సినిమా. ఈ సినిమాతో ఇండిస్టీలోకి వచ్చిన బాబీసింహా నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటించి జాతీయ అవార్డునందుకున్నారు. ఆయన పాత్ర చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అది నాకు బాగా నచ్చింది. పైగా నేను కూడా ఇలాంటి బ్యాడ్బారు క్యారెక్టర్స్ చేయాలనుకున్నా. ఒరిజనల్‌తో పోలిస్తే దాదాపు 50 శాతం మార్పులు చేశాం. నేను నటించిన గద్దలకొండ గణేష్ పాత్రని ఇంకాస్త పెంచి ఎలివేట్ చేశాం. తను చెడుగా మారడానికి ప్లాష్ బ్యాక్ కూడా కొత్తగా జోడించాం. ఈ ప్లాష్ బ్యాక్‌లోనే పూజాతో లవ్ ట్రాక్ ఉంటుంది. అందులోనే 'ఎల్లువొచ్చే గోదారమ్మ..' పాట ఉంటుంది.
నెగటివ్ క్యారెక్టర్ అవసరమా అని ఎవరైనా ప్రశ్నించారా?
- హరీష్ శంకర్ ఈ స్క్రిప్ట్ నెరేట్ చేసినప్పుడు నాకు బాగా నచ్చింది ఈ క్యారెక్టరే. అయితే చాలా మంది నెగటివ్ పాత్ర కదా బాగా ఆలోచించుకోమన్నారు. దీంతో పెదనాన్న (చిరంజీవి) దగ్గరికి ఈ స్క్రిప్ట్ తీసుకెళ్ళా. ఆయనకి చెబితే 'పాత్ర చాలా బాగుంది. నీకు డిఫరెంట్‌గా ఉంటుంది. డెఫినెట్‌గా చెరు' అని చెప్పి కొన్ని కరెక్షన్స్ చెప్పారు. ఇటీవల వస్తున్న చిత్రాల్లో ఇదొక భిన్నమైన చిత్రమవుతుంది. అవుట్‌ఫుట్‌పై నేను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను.
గద్దల కొండ గణేష్ క్యారెక్టర్ ప్రిపరేషన్ గురించి?
- ప్రత్యేకంగా ప్రిపరేషన్ అంటూ ఏమీ చేయలేదు.
అయితే హరీష్ శంకర్ బేసిగ్గా కొన్ని చెప్పారు. నాకు బౌండరీలు లేని పాత్రలంటే ఇష్టం. ఇలాగే నటించాలి అనే కొలమానాలు లేకుండా నాకు నచ్చినట్టు ఈ పాత్ర చేశా. లుక్ పరంగా కూడా పెద్దగా కేర్ తీసుకోలేదు. 'పునాదిరాళ్ళు' చిత్రంలో పెదనాన్న లుక్‌ని రిఫరెన్స్‌గా తీసుకున్నాం. తెలంగాణ యాస కోసం దర్శకుడు హరీష్‌తో కూర్చుని చర్చించాం.
పైగా అప్పటికే 'ఎఫ్2' చేయడంతో నాకు స్లాంగ్ విషయంలో బాగా హెల్ప్ అయ్యింది. గెటప్ పరంగా లుంగి, మాస్‌గా ఉండే చొక్క చాలా కంఫర్ట్‌గా అనిపించింది. సినిమా షూటింగ్‌ని చాలా బాగా ఎంజారు చేశాను.
హరీష్‌తో వర్క్ చేయడంపై మీ ఫీలింగ్?
- చాలా బాగుంది. ఆయన వేగంగా తీసే డైరెక్టర్. నేను స్లోగా మాట్లాడతానేమోగానీ, సెట్లో మాత్రం నేనూ స్పీడే. 'ఎల్లువొచ్చి గోదారమ్మ' పాట రీమిక్స్ ఆలోచన ఆయనదే. ఇది హైలైట్‌గా నిలుస్తుంది. అలాగే అధర్వ మంచి నటుడు. 'ముకుంద'తో పోల్చితే పూజా చాలా మెచ్చ్యూర్డ్గా నటించింది. ఇందులో డబ్బింగ్ చెప్పడానికి చాలా టైమ్ తీసుకున్నా. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చే ముందు ఓ ఇరవై నిమిషాల ఎపిసోడ్‌కి దాదాపు ఒక్క రోజు మొత్తం డబ్బింగ్ చెప్పాల్సి వచ్చింది. ఈ సినిమాతో నాలోని కొత్త యాంగిల్‌ని ఆడియెన్స్ చూస్తారని నమ్ముతున్నా.
ఇన్నేండ్ల జర్నీ మీకెలా అనిపిస్తోంది?
- చాలా వరకు హీరోలకు కెరీర్ ప్రారంభంలో ఒకే తరహా సినిమాలొస్తాయి. కానీ నాకు ప్రారంభం నుంచి విభిన్నమైన సినిమాలు చేసే అవకాశం వచ్చింది. ఈ విషయంలో నేను లక్కీ. నటుడిగా బౌండరీలను ఇష్టపడను. వరుణ్ అన్ని రకాల సినిమాలు చేయగలడు, ఏదైనా చేయగలడనిపించుకోవాలని కోరుకుంటా. భిన్నంగా, కొత్తగా ఏదైనా చేస్తే ఆడియెన్ షాక్ అవ్వకూడదు. సినిమా సక్సెస్ అయితే మార్కెట్ పెరుగుతుంది. దీంతో ప్రయోగాత్మక చిత్రాలు చేయడానికి స్కోప్ ఉంటుంది.
నెక్ట్స్ సినిమాల గురించి?
- బాక్సింగ్ నేపథ్యంలో ఓ సినిమా చేయబోతున్నా. 'వాల్మీకి' రిలీజ్ హడావుడి పూర్తయ్యాక బాక్సింగ్‌లో ట్రైనింగ్ తీసుకోవాలి. దీంతోపాటు నాలుగైదు కథలకు చర్చలు జరుగుతున్నాయి. అందులో 'ఎఫ్ 3' కూడా ఉండొచ్చు. ఇకపై ఒకదాని తర్వాత మరొకటి పక్కాగా ప్లాన్ చేసుకుని చేస్తా. వేగంగా చేయాల్సిన అవసరం లేదు. నాకు చాలా వయసుంది కదా. హిస్టారికల్ కథలు వస్తే చేయడానికి రెడీగా ఉన్నాను.
'సైరా' రిలీజ్‌కి సిద్ధమవుతుంది. ఎలా ఫీలవుతున్నారు?
- పెదనాన్న ఏం చేసినా మేం చూస్తాం. ఇప్పుడు 'సైరా..' కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాం. హిందీలో రాజ్‌కుమార్, తెలుగులో చిరంజీవి బయోపిక్స్ తీస్తే తానే తీస్తానని 'వాల్మీకి' షూటింగ్ టైమ్‌లో దర్శకుడు హరీష్ శంకర్ చెప్పారు. చిరంజీవిగారి బయోపిక్‌లో చిరంజీవిగా చరణ్ అన్నయ్య బాగా సూట్ అవుతారు. ఒకవేళ ఆయన చేయకపోతే నేనే చేస్తా (నవ్వుతూ).
'అంతరిక్షం' ఫెయిల్యూర్‌కి రీజన్స్?
- ఆ సినిమా పరాజయానికి చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ విషయంలో లిమిటేషన్స్ ఉన్నాయి. చాలా పెద్ద బడ్జెట్లో చేయాల్సిన చిత్రమది. షూటింగ్లో చాలా అంశాలు, అలాగే సీజీ విషయంలో బాగా రాజీపడ్డాం. ఆ ఎఫెక్ట్ తెరపై కనిపించింది. షూటింగ్ టైమ్‌లోనే ఆ విషయం మాకు అర్థమైంది. రిలీజ్ టైమ్‌కి అది మా చేతులు దాటి పోయింది. అందులో నటించిన వ్యోమగామి బొమ్మని నా ఆఫీసులో పెట్టుకున్నా. ఎవరైన కథ చెప్పడానికి వచ్చినప్పుడు ఆ బొమ్మని చూస్తూ వింటాను. మళ్ళీ ఆ మిస్టేక్ చేయకూడదని (నవ్వుతూ).