Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంజరు వర్మ, గరీమ సింగ్ జంటగా పునర్నవి భూపాళం, నవీన్ నేని కీలక పాత్రధారులుగా సందీప్ చేగురి దర్శకత్వం వహిస్తూ మూన్ వాక్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'ఒక చిన్న విరామం'. ఈ చిత్ర ఫస్ట్‌లుక్, సాంగ్ విడుదల కార్యక్రమం ఇటీవల జరిగింది. అతిథిగా విచ్చేసిన నటి అమల ఫస్ట్‌లుక్, సాంగ్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 'ఫస్ట్‌లుక్ ఆసక్తికరంగా ఉంది. 'నిన్ను చూడ' పాట సైతం చాలా అందంగా వినసొంపుగా ఉంది. మా అన్నపూర్ణ ఇనిస్టిట్యూట్‌లో చదువుకున్న దర్శకుడు సందీప్ చేగురి ఈ సినిమా తీయడం ఆనందంగా ఉంది. చాలా బాగా తీసి ఉంటారని భావిస్తున్నా. మా సంస్థ నుంచి ఇలాంటి మంచి కళాకారులు, సాంకేతిక నిపుణులు చిత్ర పరిశ్రమలోకి రావడం చాలా ఆనందంగా ఉంది. సినిమా కోసం వెయిట్ చేస్తున్నా' అని అన్నారు. 'చిత్ర పోస్టర్, పాట బాగుంది. కొత్త వాళ్ళు మరింత మంది ఇండిస్టీకి రావాలి' అని మరో అతిథి నిర్మాత రాజ్ కందుకూరి తెలిపారు. చిత్ర దర్శకుడు చెబుతూ, 'రోడ్ జర్నీ నేపథ్యంలో థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఇందులో మంచి సందేశం కూడా ఉంటుంది. అందరూ కొత్త కళాకారులతో తెరకెక్కించాం. నవంబర్‌లో విడుదలకు ప్లాన్ చేస్తున్నాం' అని చెప్పారు. 'ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడికి థ్యాంక్స్' అని హీరో సంజరు, 'ఇందులో నటించడం చాలా హ్యాపీగా ఉంది' అని హీరోయిన్ గరీమ సింగ్ తెలిపారు.