Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కల్పిత పాత్రల కంటే నిజ జీవితాన్ని ప్రతిబింబించే పాత్రల్లో నటించడమంటే నాకు చాలా ఇష్టం. ఆ దిశగానే ప్రారంభం నుంచి నా జర్నీ సాగుతుంది' అని అంటోంది సోనమ్ కపూర్. నటుడు అనిల్ కపూర్ తనయగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన సోనమ్ కపూర్ విభిన్న కథా నేపథ్య చిత్రాల్లో భిన్నమైన పాత్రలు పోషించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును, స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆమె 'ది జోయా ఫ్యాక్టర్' చిత్రంలో నటించింది. 2011 క్రికెట్ వరల్డ్ కప్ నేపథ్యంలో రొమాంటిక్ డ్రామాగా దర్శకుడు అభిషేక్ శర్మ ఈ చిత్రాన్ని రూపొందించారు. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ చిత్రం నేడు విడుదల కానుంది. ఈ సందర్బంగా సోనమ్ కపూర్ మాట్లాడుతూ, 'నేను చాలా వరకు రియల్ లైఫ్ పాత్రలు పోషించాను. అవి అంత పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు. కానీ అవి నాకు చాలా ఇష్టమైన పాత్రలు. మన సినిమాల్లో లీడ్ రోల్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. అన్ని సమస్యలకి హీరోనే పరిష్కారం అవుతారు. విలన్ డార్క్ సైడ్, హీరోయిన్ అన్నింటికి సెట్ అయినట్టుగా ఉంటుంది. కానీ అవి వాస్తవ పాత్రలు కాదు. నాకు రియల్ లైఫ్ పాత్రలు పోషించడం ఇష్టం. వారి జీవితాలను తెరపై ఆవిష్కరించడానికి ఎంతో ఉవ్విళ్లూరుతుంటాను. 'ది జోయా ఫ్యాక్టర్'లో నేను జోయాగా, దుల్కర్ నిఖిల్‌గా నటించారు. మా మధ్య ప్రేమ ఆకట్టుకుంటుంది' అని చెప్పింది.