Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తారలకు సంబంధించి చాలా విషయాలు మనకు తెలుసను కుంటాం. కానీ తెలియని విషయాలు చాలా ఉంటాయి. అవన్నీ 'ఫీట్ అప్ విత్ ది స్టార్'లో చూడొచ్చు' అని అంటోంది మంచు లక్ష్మి. వూట్ యాప్ సమర్పణలో మంచు లక్ష్మి వ్యాఖ్యాతగా 'ఫీట్ అప్ విత్ ది స్టార్' పేరుతో ఓ షో నిర్వహిస్తున్నారు. ఈ ఎంటర్ టైన్మెంట్ షో ఈనెల 23 నుంచి ప్రసారం కానుంది. ఈ విశేషాలను మంచు లక్ష్మి గురువారం మీడియాతో పంచుకున్నారు. 'ఇప్పటి వరకూ నేను చేసిన షోస్‌లో ఈ 'ఫీట్ అప్ విత్ ది స్టార్స్' అనేది చాలా భిన్నమైనది. తారలకు సంబంధించిన రాత్రి విశేషాలు, బెడ్‌పైకి వెళ్ళాక వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, దేని గురించి ఆలోచిస్తారనే ఆసక్తికర అంశాలను ఇందులో చర్చించనున్నాం. ఈ షో కోసం స్టార్స్‌ని కలిసినప్పుడు నైట్ డ్రెస్‌లో రమ్మంటే కొందరు ఆశ్చర్యపోయారు. కొందరు ఉత్సాహం చూపించారు. అయితే బాలీవుడ్లో ఈ తరహా షోలు సాధారణమే. కానీ తెలుగు ప్రేక్షకులకు మాత్రం చాలా కొత్తగా ఉండబోతోంది. వాళ్ళ పర్సనల్ విషయాలు ఈ షోతో తెలుస్తాయి. ఇందులో కాంట్రవర్సీలకు తావులేదు. స్టార్స్ నా మీద పెట్టుకున్న భరోసాను చెదరనివ్వలేదు. ఈ షోకి వచ్చే స్టార్స్ చాలా ఇంటర్వ్యూలు చేశారు. టాక్ షోలు, ఈవెంట్స్‌లో మాట్లాడారు. వాళ్ల విషయాలు చాలా తెలుసు అనుకుంటాం. కానీ వారిలో ప్రతి రోజు ఏదో ఒక మార్పు కనిపిస్తుంది. అవి వారి మాటలు, అనుభవాల్లో నుంచీ వస్తాయి. సమంతా మనకు చాలా తెలుసు అనుకుంటాం. కానీ నాగ చైతన్య గురించి ఈ షోలో మాట్లాడిన విషయాలు మీకు సర్ప్రైజింగ్గా ఉంటాయి. వరుణ్ తేజ్ చాలా కొత్తగా కనబడతాడు. వచ్చిన వాళ్ళందరూ షోని బాగా ఎంజారు చేశారు. దీంతో వాళ్ళ అభిమానులకు మరింత దగ్గర అవుతారు. ఈ షో పూర్తి వినోదాత్మకంగా సాగుతుంది' అని మంచు లక్ష్మి అన్నారు.