Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నయనతార హీరోలకు దీటుగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. అన్నీ తానై సినిమాలను నడిపిస్తూ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు. నయనతార సినిమా విడుదలవుతుందంటే ఇతర స్టార్ హీరోలు సైతం తమ సినిమాల విడుదల వాయిదా వేసుకుంటున్న సందర్భాలు చోటు చేసుకుంటున్నాయి. ఇది ఆమెకున్న క్రేజ్‌ని తెలియజేస్తుంది. క్రేజ్‌కే పరిమితం కావడం లేదు. అందుకు తగ్గట్టే పారితోషికం తీసుకుంటు న్నారు. మహిళా ప్రధాన చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న నయనతార ప్రస్తుతం తన ప్రియుడు, దర్శకుడు విఘ్నేష్ శివన్ నిర్మాతగా రూపొందుతున్న 'వెట్రిక్కన్' చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. మిలింద్ రావు దర్శకత్వంలో లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆమె అంధురాలిగా కనిపించనున్నారట. అంతేకాదు ఈ సినిమాకి భారీ మొత్తంలో పారితోషికంగా తీసుకుంటున్నారట. ఏకంగా రూ.ఆరు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటుందని తెలుస్తుంది. ఇదే కాదు తెలుగులో ఆమె నటించిన 'సైరా'కి కూడా రూ.6కోట్లు రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతోపాటు రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న 'దర్బార్', విజరు హీరోగా తెరకెక్కుతున్న 'బిగిల్' సినిమాలకి కూడా ఆమెకి రూ.ఆరుకోట్లు పారితోషికం ఇస్తున్నారట. ఇలా హీరోలకు దీటుగా రెమ్యూనరేషన్ అందుకుంటున్న కథానాయికగా నయనతార రికార్డు సృష్టిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల తన ప్రియుడు విఘ్నేష్ శివన్ పుట్టిన రోజు వేడుకలో పాల్గొని నయనతార సందడి చేశారు. అటు విఘ్నేష్, ఇటు నయనతార బ్లాక్ కలర్ డ్రెస్‌లో సందడి చేయడం విశేషం.