Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్తికేయ హీరోగా నటిస్తున్న చిత్రం '90ఎంఎల్'. శేఖర్ రెడ్డి ఎర్ర దర్శకత్వంలో కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అశోక్‌రెడ్డి గుమ్మకొండ నిర్మిస్తున్నారు. నేహా సోలంకి కథానాయికగా నటిస్తుంది. నేడు(శనివారం) కార్తికేయ పుట్టిన రోజు. ఈ సందర్భంగా చిత్ర టీజర్‌ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు శేఖర్ రెడ్డి ఎర్ర మాట్లాడుతూ, 'ఇందులో కార్తికేయ పోషిస్తున్న పాత్ర పేరు 'దేవదాస్'. ఎంబీఏ గోల్డ్ మెడలిస్ట్. అంతటి విద్యావంతుడు ఆథరైజ్డ్ డ్రింకర్‌గా పాపులర్ అవుతాడు. అతను ఎందుకు డ్రింకర్ అయ్యాడు? ముఖ్యంగా ఆథరైజ్డ్ డ్రింకర్‌గా ఎందుకు పేరు తెచ్చుకున్నాడనే అంశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. హిలేరియస్ మాస్ ఎంటర్టైనర్ చిత్రమిది. ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా కూర్చుని ఎంజారు చేసే విధంగా ఉంటుంది' అని అన్నారు. 'మా హీరో కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల చేస్తున్నాం. టీజర్‌ని బట్టే సినిమా ఎలా ఉంటుందో అర్థమైపోతుంది. సాధారణ వ్యక్తికి కూడా కనెక్ట్ అయ్యే విధంగా కాన్సెప్ట్ ఉంటుంది. ఇటీవలే హైదరాబాద్‌లోని అన్నపూర్ణ ఏడెకరాల స్టూడియోలో వేసిన సెట్లో భారీ ఎత్తున క్లైమాక్స్ చిత్రీకరించాం. అక్టోబర్ 7వ తేదీకి మొత్తం టాకీ పార్ట్ చిత్రీకరణ పూర్తవుతుంది. మూడు పాటలను యూరప్‌లోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరిస్తాం' అని నిర్మాత అశోక్ గుమ్మకొండ తెలిపారు. రవికిషన్, రావు రమేష్, అలీ, పోసాని, అజరు, కాలకేయ ప్రభాకర్, సత్యప్రకాష్, ప్రగతి, ప్రవీణ్, అదుర్స్ రఘు, నెల్లూరు సుదర్శన్, తాగుబోతు రమేశ్, రోల్ రిడా, దువ్వాసి మోహన్, సంజరు స్వరూప్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: జె.యువరాజ్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, ఆర్ట్: జీఎం శేఖర్.