Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్'. రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్ థ్రెస్సా, ఇజాబెల్లా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై కె.ఎ.వల్లభ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ని శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందం చెబుతూ, 'ఈ సినిమా సెట్ అయినప్పట్నుంచి అందరిలోనూ మంచి అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఇటీవల టైటిల్‌ని విడుదల చేశాం. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజా ఫస్ట్‌లుక్‌లో లాంగ్ హెయిర్, గడ్డంతో ఉన్న విజరుదేవరకొండ లుక్ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇందులో విజరు ముఖంపై ఉన్న రక్తపు మరకలు క్యారెక్టర్‌లోని ఇంటెన్సిటిని తెలియజేస్తుంది. దర్శకుడు క్రాంతి మాధవ్ సెన్సిబుల్ కథాంశంతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. టైటిల్ జస్టిఫికేషన్ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ప్రస్తుతం ఇది హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీసుందర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు' అని తెలిపింది.