Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిరంజీవి నటిస్తున్న 'సైరా నరసింహారెడ్డి' ట్రైలర్ ఇటీవల విడుదలైంది. దీనికి దేశ వ్యాప్తంగా విశేషమైన స్పందన లభిస్తుంది. యావత్ ఇండియన్ ఆడియెన్స్, సినీ ప్రముఖులు ఫిదా అవుతున్నారు. అమిర్ ఖాన్ వంటి బాలీవుడ్ ప్రముఖులు సైతం ట్రైలర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ట్విట్టర్ వేదికగా అమిర్ స్పందిస్తూ, 'నేను చిరంజీవిగారికి పెద్ద అభిమానిని. 'సైరా' ట్రైలర్ చూశా. అద్భుతంగా ఉంది. సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా. చిరంజీవి, రామ్‌చరణ్, చిత్ర బృందానికి అభినందనలు' అని అమీర్ ఖన్ పేర్కొన్నారు. ఆయనతోపాటు పలువురు బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు కూడా ట్రైలర్‌ని ప్రశంసించారు. ఇదిలా ఉంటే 'సైరా' బృందం సల్మాన్, అమిర్ వంటి బాలీవుడ్ ప్రముఖుల కోసం ప్రత్యేకంగా షో వేయాలని భావిస్తున్నారు. దీని ద్వారా హిందీలో మంచి ప్రమోషన్ జరుగుతుంది. అక్కడ మార్కెట్ పెరగడానికి ఇది ఎంతో హెల్ప్ అవుతుందని భావిస్తున్నారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'సైరా నరసింహారెడ్డి'లో నయనతార కథానాయికగా నటిస్తుండగా, అమితాబ్ బచ్చన్, విజరు సేతుపతి, సుదీప్, జగపతిబాబు, తమన్నా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం దసరా పండుగని పురస్కరించుకుని గాంధీ జయంతి రోజున అక్టోబర్ 2న తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక నేడు (ఆదివారం) సాయంత్రం హైదరాబాద్‌లో జరుగనుంది. ఇందులోని టైటిల్ సాంగ్‌ని విడుదల చేయనున్నారు.