Authorization
Mon Jan 19, 2015 06:51 pm
92వ ఆస్కార్ ఎంట్రీ కోసం విదేశీ చిత్ర విభాగంలో బాలీవుడ్ చిత్రం 'గల్లీబాయ్' ఎంపికైంది. వచ్చే ఏడాది ప్రదానం చేసే ఆస్కార్ అవార్డుల కోసం విదేశీ విభాగంలో నామినేషన్‌కి పోటీ పడనుంది. నటి, ఫిల్మ్ మేకర్ అపర్ణ సేన్ అధ్యక్షతన ఏర్పాటైన జ్యూరీ ఈ చిత్రాన్ని సెలక్ట్ చేయగా, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రెటరీ సుప్రన్ సేన్ అధికారికంగా శనివారం ప్రకటించారు. విదేశీ చిత్ర విభాగంలో 'గల్లీబారు' సినిమా ఎంపిక కావడంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తూ చిత్ర నిర్మాత ఫర్హాన్ అక్తర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
'గల్లీబారు' 92వ ఆస్కార్ అవార్డుల బరిలో పోటీపడేందుకు ఎంపికైంది. మన టైమ్ వచ్చేసింది. ఫిల్మ్ ఫెడరేషన్‌కి ధన్యవాదాలు. జోయా అక్తర్, రణ్వీర్ సింగ్, అలియాభట్లకు శుభాకాంక్షలు' అని తెలిపారు.
ఆస్కార్ విదేశీ చిత్ర విభాగం కోసం వివిధ భాషల నుంచి 28 సినిమాలను స్క్రీనింగ్ కోసం జ్యూరీ ఎంపిక చేయగా, వీటిలో తెలుగు నుంచి విజరు దేవరకొండ నటించిన 'డియర్ కామ్రేడ్' సినిమా ఉండటం విశేషం. అన్ని సినిమాలను వీక్షించిన జ్యూరీ ఫైనల్‌గా 'గల్లీబారు'ని ఎంపిక చేసింది. జోయా అక్తర్ దర్శకత్వంలో రూపొందిన 'గల్లీబారు'లో రణ్వీర్ సింగ్, అలియాభట్ నటించారు. మురికివాడలో జన్మించిన ఓ కుర్రాడు సంగీతం రంగంలో రాణించేందుకు తపిస్తాడు. ఈ ప్రయాణంలో అనేక ఇబ్బందులు, ఎన్నో అవమానాలు ఎదుర్కొంటాడు. ఎంతో కష్టపడి ర్యాప్ సింగర్‌గా గుర్తింపు తెచ్చుకుంటాడు. అట్నుంచి తాను అనుకున్న గమ్యానికి ఎలా చేరుకున్నాడనే స్ఫూర్తివంతమైన కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ ఏడాది ఫిబ్రవరి 14న విడుదలై విశేష ఆదరణ పొందింది. రూ.40కోట్లతో తెరకెక్కి ఏకంగా రూ.230కోట్లను వసూలు చేసింది.
'డియర్ కామ్రేడ్', 'ఆంధాధున్', 'ఆర్టికల్ 15', 'ఉరి:ది సర్జికల్ స్ట్రైక్', 'బదాయిహౌ', 'గల్లీబారు', 'కేసరి', 'సూపర్ డీలక్స్', 'హెల్లారో', 'ఓలు', 'వాడ చెన్నై', 'కురుక్షేత్ర', 'నగర్‌కీర్తన్', 'ఆనంది గోపాల్', 'అండ్ ది ఆస్కార్ గోస్ టు', 'బాబా', 'బద్లామ్ బందిశాల', 'బుల్బుల్ కెన్ సింగ్', 'చాల్ జీవి లైయి', 'ఘోడ్ కో జలేబి ఖిలానే లే జా రియా హూన్', 'కోంతో', 'మయి ఘాట్: క్రైమ్ నెం.103- 2005', 'ఒత్తా సెరుప్పు సైజ్ 7', 'పహున: ది లిటిల్ విజిటర్', 'తరిఖ్-ఏ టైమ్‌లైన్', 'ఉయరె' వంటి తదితర చిత్రాలు స్క్రీనింగ్ కోసం ఎంపికై ఆస్కార్ ఎంట్రీకి పోటీ పడ్డాయి.