Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'సీనయ్య'. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నరసింహ దర్శకత్వంలో దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వినాయక్ పుట్టినరోజు నేపథ్యంలో ఈ చిత్ర ప్రారంభోత్సవం బుధవారం అన్నపూర్ణ స్టూడియోలో అంగరంగ వైభవంగా జరిగింది. వినాయక్‌పై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు క్లాప్‌నివ్వగా, కొరటాల శివ కెమెరా స్విచాన్ చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ,'వినరుతో 'ఆది' సినిమా నుండి నా జర్నీ స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత మా సంస్థని స్థాపించినప్పుడు తొలి సినిమాగా ఆయన దర్శకత్వంలోనే 'దిల్' సినిమా చేశాం. ఆ సినిమా పేరే నా ఇంటి పేరుగా మార్చేంత పెద్ద సినిమా అయ్యింది. మా సంస్థ సక్సెస్‌ఫుల్‌గా, వినాయక్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ట్‌గా జర్నీ ట్రావెల్ అవుతున్న సందర్భంలో శంకర్ కో డైరెక్టర్ నరసింహ ఈ 'సీనయ్య' కథని మా హర్షిత్‌కి చెప్పాడు. హర్షిత్‌కి నచ్చి నా దగ్గరికి తీసుకొచ్చాడు. కథ విన్నాను. చాలా బాగుంది. దీన్ని మామూలుగా తీస్తే జనాలకు రీచ్ కాదు. అందుకే ఎవర్నైనా డైరెక్టర్ని హీరోగా పెట్టి తీస్తేనే మ్యాజిక్ జరుగుతుందనుకున్నాను. ఆ టైమ్‌లో నేను వర్క్ చేసిన దర్శకుల గురించి ఆలోచిస్తున్నప్పుడు వినాయక్ గుర్తొచ్చాడు. ఈ కథకి వినాయక్ యాప్ట్ అనిపించింది. వెంటనే వినరుని ఈ కథ వినమని చెప్పా. కథ విని నీ సెలక్షన్ సూపర్..నేను హీరోగా సినిమా చేస్తున్నానని చెప్పాడు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌ని అందరూ బాగుందన్నారు. హరి మా కథలో భాగమవుతున్నాడు. తను ప్యూచర్లో మా బ్యానర్ నుండి డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ అవుతాడు. మణిశర్మ సంగీతం, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రంలో ఎస్టాబ్లిష్ ఆర్టిస్టులు తక్కువగా ఉండి, కొత్తవాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఈ సినిమా కోసం వినరు చాలా డెడికేటెడ్‌గా నాలుగు గంటల పాటు జిమ్ చేస్తున్నాడు. స్లిమ్‌గా తయారయ్యాడు. సమ్మర్లో ఓ మంచి సినిమా చూపిస్తాం. మంచి కథతో చేస్తున్న ఈ సినిమాకి మంచి రిజల్ట్ వస్తుందని ఆశిస్తున్నాం' అని చెప్పారు.
'డెస్టినీ నాకు వింతగా ఉంది. ఓ రోజు దిల్‌రాజు నా దగ్గరికొచ్చి, నువ్వు నన్ను దిల్‌రాజుని చేశావ్. నేను నిన్ను హీరోగా చేద్దామనుకుంటున్నానని చెప్పాడు. ఓ స్క్రిప్ట్ విన్నాను. నువ్వు అయితే బాగుంటుంది. చేయమని చెప్పాడు. నాకు కామెడీ, పాటలు, డాన్సులు వద్దు.. హూందాగా ఉంటేనే చేస్తానని చెప్పాను. అలాంటి కథే అని దిల్‌రాజు అన్నారు. నరసింహ ఈ కథని నెరేట్ చేసినప్పుడు నా క్యారెక్టర్ని అతనెంతగా ప్రేమించాడో అర్థమైంది. కథ, క్యారెక్టర్ బాగా నచ్చడంతో ఈ సినిమాలో హీరోగా చేస్తానని రాజుకి చెప్పాను. ఆ తర్వాత పాత్ర కోసం కొంత బరువు తగ్గాను. ఈ సినిమాకి స్క్రిప్ట్ పరంగా హరిగారు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. దిల్‌రాజు కథనే నమ్ముతాడు. ఆయనకు ఈ సందర్భంగా థ్యాంక్స్. ఎస్వీసీ బ్యానర్ అంటే నా బ్యానర్ అనే ఫీలింగ్ ఉంటుంది. నా ఇంటి బ్యానర్ నుండి నేను హీరోగా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్‌లుక్ బాగుందని అభినందించిన అందరికీ థ్యాంక్స్' అని వినాయక్ అన్నారు.
'ఇది వరకు వినాయక్‌గారు ఎన్నో పుట్టినరోజులు జరుపుకున్నప్పటికీ మా 'సీనయ్య'గా తొలి పుట్టినరోజు జరుపుకుంటున్నారు. మంచి ఎమోషనల్ కథ ఇది. వినరు, రాజుగారు నన్ను నమ్మి నాకు కొత్త బాధ్యతని అప్పగించారు. గొప్ప టెక్నిషియన్స్‌ని ఇచ్చారు. అందరి సపోర్ట్‌తో నా బాధ్యతను కరెక్ట్‌గా నిర్వహిస్తాను' అని దర్శకుడు నరసింహారావు చెప్పారు. 'రాజుగారితో పదేండ్లుగా ట్రావెల్ చేస్తున్న నరసింహారావు రాజు, వినరుకి కథ చెప్పి ఒప్పించిన తర్వాత నేను ఇన్వాల్ అయ్యాను. వినాయక్‌గారు పెద్ద డైరెక్టర్ అయినా ఆర్టిస్టుగా ప్రతి విషయాన్ని తెలుసుకుని ఫిజికల్‌గా, మెంటల్‌గా రెడీ అయ్యారు. మేం కూడా మా వంతు ప్రయత్నంగా సినిమాని చక్కగా తీర్చిదిద్దుతాం. అందరూ గర్వంగా చెప్పుకునేలా సినిమా ఉండేలా ప్రయత్నిస్తాం' అని రచయిత హరి అన్నారు. 'మంచి కథతో ఈ సినిమా రూపొందుతున్న ఈచిత్రానికి పని చేసే అవకాశాన్నిచ్చిన రాజు, శిరీష్, నరసింహరావుగారికి థ్యాంక్స్' అని సినిమాటోగ్రాఫర్ సాయి శ్రీరామ్ చెప్పారు.