Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందబోయే నయా చిత్రం దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం వైభవంగా ప్రారంభమైంది. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరంజీవి నటిస్తున్న 152వ చిత్రమిది. ''ఖైదీ నంబర్ 150', 'సైరా నరసింహారెడ్డి' వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత చిరంజీవి హీరోగా, డిఫరెంట్ కమర్షియల్ ఎంటర్టైనర్స్తో వరుస బ్లాక్‌బస్టర్స్‌ను సొంతం చేసుకున్న దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న కొత్త సినిమా పూజా కార్యాక్రమాలను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ చిత్రానికి శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, తిరు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో నటించే నటీనటులు, పని చేసే సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తాం' అని చిత్ర బృందం తెలిపింది.