Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాకేష్ వర్రే, గార్గేయి ఎల్లా ప్రగడ జంటగా, బసవ శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఎవ్వరికీ చెప్పొద్దు'. దసరా కానుకగా విడుదలైన సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో దర్శకుడు బసవ శంకర్, హీరోయిన్ గార్గేయి మంగళవారం మీడియాతో ముచ్చటించారు. దర్శకుడు బసవ శంకర్ మాట్లాడుతూ, 'మాది కృష్ణా జిల్లా. దర్శకత్వం వహించాలని చాలా ఏండ్ల క్రితం ఇండిస్టీకి వచ్చాను. 'ఇంకోసారి', 'బిస్కెట్'తోపాటు పలు చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశా. వాటిలో 'రన్‌రాజా రాన్', 'పెళ్ళిచూపులు' మంచి విజయం సాధించాయి. ఆ తర్వాత ఈ కథతో ట్రావెల్ అవుతున్నా. ఓ నిర్మాణ సంస్థలో కమిట్ కూడా అయ్యాను. హీరోలు ఫైనల్ అయ్యే క్రమంలో రాకేష్ హీరోగా ప్రయత్నిస్తున్నాడు, మంచి కథల కోసం చూస్తున్నాడని తెలిసి ఆయన్ని కలిశా. తను చాలా ఎగ్జైట్ అయి సినిమా చేసేందుకు ముందుకు వచ్చాడు. అయితే రాకేష్ ఏ దర్శకుడినైనా కలవాలనుకున్నప్పుడు, తనకు ఓ రోల్ అడిగే క్రమంలో ముందుగానే ఆ పాత్ర గురించి ఊహించుకుని తను యాక్ట్ చేస్తూ వీడియో రూపొందించి చూపిస్తారు. అదే తనని ప్రత్యేక స్థానంలో నిలబెడుతుంది. అది నాకూ బాగా నచ్చింది. ఇది క్యాస్ట్ నేపథ్యంలో సాగే లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్. నా ఫ్రెండ్ జీవితంలో చూసిన అంశాల ఆధారంగా చేసుకుని ఈ కథ రాసుకున్నా. స్నేహితుడి ప్రియురాలు క్యాస్ట్ కారణంగా దూరమవుతుంది. దీంతో ఇప్పటికీ అతను అమ్మాయిలపై ద్వేషం పెంచుకుని ఉంటాడు. దానికి పరిష్కారం ఇలా ఉంటే బాగుండూ అన్నదే ఈ సినిమా. మంచి ప్రతిభ కలిగిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో సినిమా చేయాలనుకున్నా. హీరోయిన్ పాత్రకి దాదాపు 150 మందిని ఆడిషన్ చేశాం. కొత్తవారితో చేయడం వల్ల నాకు నచ్చినట్టు తీయగలిగాను. ఇందులో క్యాస్ట్ గురించి చెప్పాం, కానీ ఎవరినీ కించపరచలేదు. చాలా మంది సినీ పెద్దలు సినిమా చూసి ప్రశంసిస్తున్నారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఫోన్ చేసి మాట్లాడారు. సినిమా నచ్చి దిల్‌రాజుగారు విడుదల చేశారు. ఆయన విలువైన సలహాలు కూడా ఇచ్చారు. సినిమాని ఆయన విడుదల చేయడం బాగా ప్లస్ అయ్యింది. సినిమాకి అన్ని ఏరియాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది' అని అన్నారు.
గార్గేయి చెబుతూ, 'నేను హైదరాబాద్‌లోనే పుట్టిపెరిగాను. ప్రస్తుతం బ్యాచిలర్ డిగ్రీ చేస్తున్నా. నైన్త్ క్లాస్‌లో ఉన్నప్పుడే యాక్టింగ్ కోసం ఆడిషన్స్‌కి వెళ్ళడం ప్రారంభించా. అలా ఈటీవీలో ప్రసారమయ్యే 'హృదయం' అనే సీరియల్లో నటించాను. మధ్యలో బ్రేక్ ఇచ్చి డిగ్రీలోకి వచ్చాక మళ్ళీ ఆడిషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. అలా ఈ సినిమా అవకాశం వచ్చింది. క్యాస్ట్ ఫీలింగ్ గురించి చాలా మందికి ఉంటుంది. కానీ బయటకు మాట్లాడరు. ఈ కథ విన్నప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. ట్రెండీగా అనిపించింది. సినిమాలో నా నటన చూసి ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నారు. ఇంత బాగా చేస్తావని ఊహించలేదన్నారు. అలాగే ఫ్రెండ్స్ కూడా చూసి చాలా కొత్తగా కనిపిస్తున్నావన్నారు. సినిమా అందరికి బాగా నచ్చింది. కొత్తగా కొన్ని కాల్స్ వస్తున్నాయి. ఇంకా దేనికి కమిట్ కాలేదు. డిగ్రీ పూర్తయ్యాక పూర్తిగా యాక్టింగ్‌పై దృష్టిపెడతా' అని తెలిపింది.