Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామ్‌గోపాల్ వర్మ నిర్మాణంలో వస్తున్న సినిమా 'బ్యూటిఫుల్'. 'ట్రిబ్యూట్ టు రంగీలా' అనేది ఉపశీర్షిక. సూరి, నైనా గంగూలీ జంటగా నటిస్తుండగా, అగస్త్య మంజు దర్శకత్వంలో టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై టి.అంజయ్య సమర్పణలో టి.నరేష్, టి. శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గురించి యూనిట్ చెబుతూ, 'వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్'కి సహ దర్శకుడిగా పనిచేసిన అగస్త్య మంజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. వైవిధ్యమైన కథాంశంతో రొమాంటిక్ ప్రేమ కథగా సినిమా తెరకెక్కుతుంది. ఇటీవల విడుదలైన ఈ ట్రైలర్‌కి విశేషమైన స్పందన లభించింది. ఈ సినిమాలోని మొదటి పాటని ఈ నెల 20 నుంచి 25 మధ్యలో విడుదల చేయనున్నాం. అలాగే ఈ నెలాఖరులో నిర్వహించే ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా చిత్ర బృందం వైజాగ్, విజయవాడ, హైదరాబాద్‌ల్లోని వివిధ కాలేజీల్లో సందడి చేయనుంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలోనే సినిమాని విడుదల చేస్తాం' అని చెప్పింది.