Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్ట్రయిట్ కథల కంటే రీమేక్ సినిమాలపై నాగార్జున బాగా ఫోకస్ చేశారు. ఇటీవల కాలంలో ఆయన నటించిన 'ఊపిరి', 'మన్మథుడు 2' చిత్రాలు సైతం రీమేక్ చిత్రాలే. ఈ రెండు విమర్శకుల ప్రశంసలు పొందాయే తప్ప కమర్షియల్‌గా పెద్ద సక్సెస్ సాధించలేదు. ఇదిలా ఉంటే, లేటెస్ట్గా నాగార్జున మరో రీమేక్‌లో నటిచేందుకు గ్రీన్‌సిగల్ ఇచ్చారని సమాచారం. గతేడాది బాలీవుడ్లో వచ్చిన 'రైడ్' చిత్రం మంచి విజయం సాధించింది. ఉత్తరప్రదేశ్‌లోని ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ చేసిన అతిపెద్ద రైడ్ నేపథ్యంలో రూపొందిన 'రైడ్'లో అజరు దేవగన్ హీరోగా నటించారు. ఆయన సరసన ఇలియానా కథానాయికగా నటించింది. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ ప్లాన్ చేస్తున్నారట. ఇందులో నాగార్జున నటిస్తే బాగుంటుదని అనుకుంటున్నారట. దీంతోపాటు నాగార్జున ప్రస్తుతం నూతన దర్శకుడు సాల్మన్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఓ సినిమా చేసేందుకు పచ్చ జెండా ఊపారు. ఇది డిసెంబర్లో ప్రారంభం కానుందని తెలుస్తోంది. అలాగే కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రానికి సీక్వెల్‌గా 'బంగార్రాజు' చేయబోతున్న విషయం విదితమే.